https://oktelugu.com/

నా ఆవులను వెతికి పెట్టండి : డీజీపీకి ఎమ్మెల్యే జగ్గారెడ్డి లేఖ

తన ఆవులను ఎవరో దొంగిలించారని, పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికి పట్టించుకోలేదని ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. ఈ మేరకు ఆవులను దొంగిలించిన వారిని పట్టుకోవాలని ఆయన డీజీపీకి లేఖ రాశారు. గత అక్టోబర్ లో తన ఆరు ఆవులు దొంగిలించబడ్డాయన్నారు. తను నిత్యం పూజించే ఓ ఆవు అందులో ఉందన్నారు. దీనిపై సంగారెడ్డి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశానని, ఇంతవరకు పట్టుకోలేదన్నారు. ప్రేమతో పెంచుకున్న ఆవులను దొంగిలించా ఏమీ చేయలేని పరిస్థితి ఎదురైందన్నారు. సంగారెడ్డిలో చాలా ఆవులు […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : December 25, 2020 / 12:18 PM IST
    Follow us on

    తన ఆవులను ఎవరో దొంగిలించారని, పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికి పట్టించుకోలేదని ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. ఈ మేరకు ఆవులను దొంగిలించిన వారిని పట్టుకోవాలని ఆయన డీజీపీకి లేఖ రాశారు. గత అక్టోబర్ లో తన ఆరు ఆవులు దొంగిలించబడ్డాయన్నారు. తను నిత్యం పూజించే ఓ ఆవు అందులో ఉందన్నారు. దీనిపై సంగారెడ్డి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశానని, ఇంతవరకు పట్టుకోలేదన్నారు. ప్రేమతో పెంచుకున్న ఆవులను దొంగిలించా ఏమీ చేయలేని పరిస్థితి ఎదురైందన్నారు. సంగారెడ్డిలో చాలా ఆవులు దొంగతనానికి గురవుతున్నాయని, మేతకు వదిలిపెడితే కబేళాలకు తరలిస్తున్నారన్నారు. ఇలాంటివి జరగకుండా రాష్ట్ర డీజీపీని కోరుతున్నానన్నారు.