ఓ బస్సులో భారీగా మద్యం తరలిస్తుండగా రాజేంద్రనగర్ పోలీసులు పట్టుకున్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సమీపంలోని సాతంరాయి వద్ద ఎస్ఓటీ బ్రుందం తనిఖీలు చేపట్టింది. అయితే ఓ ప్రైవేట్ బస్సులో నుంచి కాటన్లను ఆటోలోకి ఎక్కిస్తుండగా అటువైపు వెళ్తున్న పోలీసులకు అనుమానం వచ్చింది. ఆ కాటన్లను తనిఖీ చేయగా అందులో మద్యం సీసాలు కనిపించాయి. దీంతో 14 కాట్ల మద్యం సీసాలను స్వాధీనం చేసుకొని అక్కడున్న నలుగురిని అరెస్టు చేసినట్లు రాజేంద్రనగర్ పోలీసులు తెలిపారు. ఈ మద్యం విలువ సుమారు రూ.4 లక్షలు ఉంటుందని, దీనిని గోవా నుంచి హైదరాబాద్ కు తీసుకువచ్చారని వారు పేర్కొన్నారు.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: Heavy moving alcohol confiscation
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com