
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్నివర్గాల సంక్షేమానికి టీఆర్‌ఎస్ ప్రభుత్వ ప్రత్యేక కృషి చేస్తోందని పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ప్రత్యేకించి దివ్యాంగుల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. బుధవారం రవీంద్రభారతి ప్రాంగణంలో హోప్ ఫౌండేషన్ సంస్ధ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ దివ్యాంగులకు ఉచిత కుట్టు మిషన్‌లను పంపిణీ చేశారు. సంస్ధ నిర్వహించే సంక్షేమ కార్యక్రమాలకు ప్రభుత్వ సహకారం ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో హోప్ ఫౌండేషన్ ఛైర్మన్ కొండ విజయ్‌కుమార్, రాష్ట్ర గౌడ సంఘాల జేఏసీ ఛైర్మన్ పల్లె లక్ష్మణ్‌గౌడ్ , మహబూబ్‌నగర్ జిల్లా టీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రశాంత్‌భాస్కర్‌రావు, జయ ప్రకాశ్‌నారాయణ కాలేజీల ఛైర్మన్ రవికుమార్, రమణ తదితరులు పాల్గొన్నారు.