వాట్సాప్ యూజర్లకు శుభవార్త.. 2021లో వచ్చే కొత్త ఫీచర్లివే..?

స్మార్ట్ ఫోన్ లో ఎక్కువమంది ఉపయోగించే అప్లికేషన్ గా వాట్సాప్ కు పేరుంది. ఫేస్ బుక్ వాట్సాప్ ను కొనుగోలు చేసిన తరువాత వాట్సాప్ లో కొత్తగా ఎన్నో ఫీచర్లు అందుబాటులోకి వస్తున్నాయి. మన దేశంలోనే కాదు ఇతర దేశాల్లో సైతం స్మార్ట్ ఫోన్ యూజర్లు వాట్సాప్ యాప్ ను ఉపయోగించడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఈ ఏడాది డిజప్పియరింగ్ మెసేజెస్, పేమెంట్ సర్వీసెస్, గ్రూప్ వీడియో కాల్స్, మ్యూట్ ఆల్వేస్, చాట్ వాల్ పేపర్స్ లాంటి […]

Written By: Navya, Updated On : December 24, 2020 11:50 am
Follow us on


స్మార్ట్ ఫోన్ లో ఎక్కువమంది ఉపయోగించే అప్లికేషన్ గా వాట్సాప్ కు పేరుంది. ఫేస్ బుక్ వాట్సాప్ ను కొనుగోలు చేసిన తరువాత వాట్సాప్ లో కొత్తగా ఎన్నో ఫీచర్లు అందుబాటులోకి వస్తున్నాయి. మన దేశంలోనే కాదు ఇతర దేశాల్లో సైతం స్మార్ట్ ఫోన్ యూజర్లు వాట్సాప్ యాప్ ను ఉపయోగించడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఈ ఏడాది డిజప్పియరింగ్ మెసేజెస్, పేమెంట్ సర్వీసెస్, గ్రూప్ వీడియో కాల్స్, మ్యూట్ ఆల్వేస్, చాట్ వాల్ పేపర్స్ లాంటి కొత్త ఫీచర్లను వాట్సాప్ యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది.

Also Read: రైతులతో మాట్లాడబోతున్న మోదీ.. దీక్షలను ముగించేస్తారా?

అయితే వచ్చే ఏడాది మరికొన్ని కొత్త ఫీచర్లను వాట్సాప్ యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుందని.. ఈ కొత్త ఫీచర్ల ద్వారా యూజర్లకు మరింత చేరువ కావాలని వాట్సాప్ భావిస్తోందని తెలుస్తోంది. వాట్సాప్ వచ్చే ఏడాది పేస్ట్ మల్టీపుల్ ఐటమ్స్ అనే ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురానుంది. అయితే ఈ ఫీచర్ ను వాట్సాప్ కేవలం ఐఓఎస్ యూజర్ల కోసం మాత్రమే అందుబాటులోకి తీసుకురానుందని సమాచారం.

Also Read: ఆధార్ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. సులభంగా పేరు, అడ్రస్ మార్చుకునే ఛాన్స్..?

ఈ కొత్త ఫీచర్ సహాయంతో వాట్సాప్ యూజర్లు మల్టీపుల్ ఫోటోలు, వీడియోలను చాట్ లో పేస్ట్ చేసుకోవచ్చు. ఒకేసారి ఒకటికి మించిన ఐటెమ్స్ ను సెలక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ బటన్ ను క్లిక్ చేసి కాపీ చేయడం ద్వారా నచ్చిన వారికి మల్టీపుల్ ఐటమ్స్ ను ఒకేసారి పంపే అవకాశం ఉంటుంది. వాట్సాప్ వచ్చే ఏడాది ఈ కొత్త ఫీచర్ ను యాపిల్ ఫోన్ యూజర్ల కొరకు అందుబాటులోకి తీసుకురానున్నట్టు ఒక ప్రకటన లో తెలిపింది.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్

వచ్చే ఏడాది వాట్సాప్ వెబ్ వెర్షన్ వాడే యూజర్లు సైతం వాయిస్ కాలింగ్, వీడియో కాలింగ్ ఫీచర్లను వినియోగించుకోవచ్చు. బీటా యూజర్లకు ఇప్పటికే ఈ ఫీచర్లు అందుబాటులోకి రాగా మిగిలిన వారికి సైతం వాట్సాప్ వీలైనంత త్వరగా ఈ ఫీచర్లను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తోంది. ఒక పాప్ అప్ ద్వారా వాట్సాప్ యూజర్లు ఈ ఫీచర్ ను వినియోగించుకోవచ్చు. 2021 ఫిబ్రవరి 8 నుంచి వాట్సాప్ నూతన నిబంధనలు, ప్రైవసీ పాలసీలను అంగీకరిస్తే మాత్రమే వాట్సాప్ ను వినియోగించే అవకాశం ఉంటుంది.