https://oktelugu.com/

రైతులతో మాట్లాడబోతున్న మోదీ.. దీక్షలను ముగించేస్తారా?

మోదీ సర్కార్ కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. గడిచిన 28రోజులుగా ఢిల్లీలో వణికించే చలిలోనూ దీక్షలు చేస్తున్నారు. దీంతో మోదీ సర్కార్ పై పెద్దఎత్తున విమర్శలు వస్తున్నాయి. Also Read: ఆధార్ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. సులభంగా పేరు, అడ్రస్ మార్చుకునే ఛాన్స్..? పంజాబ్ రైతులతో మొదలైన రైతు ఉద్యమం క్రమంగా దేశవ్యాప్తంగా ఉద్యమంగా మారింవది. డిసెంబర్ 8న రైతు సంఘాలు ఇచ్చిన భారత్ బంద్ కు అన్నివర్గాల […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 23, 2020 / 07:14 PM IST
    Follow us on

    మోదీ సర్కార్ కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. గడిచిన 28రోజులుగా ఢిల్లీలో వణికించే చలిలోనూ దీక్షలు చేస్తున్నారు. దీంతో మోదీ సర్కార్ పై పెద్దఎత్తున విమర్శలు వస్తున్నాయి.

    Also Read: ఆధార్ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. సులభంగా పేరు, అడ్రస్ మార్చుకునే ఛాన్స్..?

    పంజాబ్ రైతులతో మొదలైన రైతు ఉద్యమం క్రమంగా దేశవ్యాప్తంగా ఉద్యమంగా మారింవది. డిసెంబర్ 8న రైతు సంఘాలు ఇచ్చిన భారత్ బంద్ కు అన్నివర్గాల నుంచి మద్దతు లభించడంతో బంద్ విజయమైంది.

    రైతుల ఆందోళన నేపథ్యంలో ఇప్పటికే పలుమార్లు కేంద్రం పలుమార్లు చర్చలు జరిపింది. అయితే ఈ చర్చలు కొలిక్కి రాకపోవడంతో రైతులు ఇంకా ఆందోళనలు కొనసాగిస్తూనే ఉన్నారు.

    ఈక్రమంలోనే ప్రధాని మోదీ డిసెంబర్ 25న దేశంలోని రైతులను ఉద్దేశించి మాట్లాడబోతున్నారు. మాజీ ప్రధాని వాజ్ పాయ్ జయంతి సందర్భంగా దేశంలోని 9కోట్ల మంది రైతుల అకౌంట్ లో కిసాన్ సమ్మాన్ యోజన పథకం కింద మరోసారి 2వేలు జమ చేయనున్నారు.

    Also Read: ఎన్నికల ఎఫెక్ట్.. పశ్చిమ బెంగాల్లో ‘తెలుగు’ వెలుగు..!

    ఇందుకోసం రూ.18వేల కోట్ల రూపాయల నిధులను కేంద్రం విడుదల చేయనుంది. ఇదే సమయంలో ప్రధాని మోదీ దేశంలోని రైతులందరికీ కొత్త చట్టాలను వివరించనున్నారు.

    వ్యవసాయ చట్టంలో చేయబోతున్న మార్పులు.. రైతులకు కలిగే లాభాలను వివరించనున్నారు. దీంతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ తర్వాత రైతులు తమ ఉద్యమాన్ని విరమించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.  దీంతో అందరికీ చూపు డిసెంబర్ 25పైనే పడింది.

    మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్