https://oktelugu.com/

ములుగులో విషాదం: గోదావరి నదిలో నలుగురు గల్లంతు

ములుగు జిల్లాలోని గోదావరి నదిలో నలుగురు యువకులు గల్లంతయ్యారు. వీరిలో ఇద్దరు మృతి చెందారు. జిల్లాలోని వెంకటాపూరం మండలం రంగరాజపురం గ్రామానికి చెందిన 16 మంది గోదావరి పరిసర ప్రాంతాల్లో శనివారం సాయంత్రం ఓ స్నేహితుడి బర్త్ డే పార్టీ  కోసం వెళ్లారు. అనంతరం సరదాగా ఈత కొట్టేందుకు గోదావరి నదిలోకి దిగారు. వీరిలో 12 మంది ఒడ్డుపైకి రాగా నలుగురు యువకులు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు గల్లంతైన వారి కోసం అన్వేషించారు. వీరిలో ఇద్దరి […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : November 15, 2020 / 09:56 AM IST
    Follow us on

    ములుగు జిల్లాలోని గోదావరి నదిలో నలుగురు యువకులు గల్లంతయ్యారు. వీరిలో ఇద్దరు మృతి చెందారు. జిల్లాలోని వెంకటాపూరం మండలం రంగరాజపురం గ్రామానికి చెందిన 16 మంది గోదావరి పరిసర ప్రాంతాల్లో శనివారం సాయంత్రం ఓ స్నేహితుడి బర్త్ డే పార్టీ  కోసం వెళ్లారు. అనంతరం సరదాగా ఈత కొట్టేందుకు గోదావరి నదిలోకి దిగారు. వీరిలో 12 మంది ఒడ్డుపైకి రాగా నలుగురు యువకులు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు గల్లంతైన వారి కోసం అన్వేషించారు. వీరిలో ఇద్దరి మృత దేహాలు లభ్యమయ్యయి.  శ్రీకాంత్, అన్వేష్, కార్తీక్, ప్రకాశ్ లుగా గల్లంతైన వారుగా గుర్తించారు. అయితే మిగతా ఇద్దరి కోసం సహాయక చర్యలు చేపడుతున్నారు. పండగపూట విషాదంగా మారిన ఈ ఘటనతో ములుగు జిల్లాలోని మృతుల కుటుంబ సభ్యలు కన్నీరు మున్నీరవుతున్నారు.