హైదరాబాద్ నగరంలోని కూకట్ పల్లిలో ఓ ఎలక్ట్రికల్ దుకాణంలో భారీ అగ్ని ప్రమాదంలో చోటు చేసుకుంది. కూకట్ పల్లి కేపీహెచ్ బీ కాలనీలోని రాందేవ్ ఎలక్ట్రికల్ అండ్ హార్డ్ వేర్ షాఫులో ఆదివారం ఉదయం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అగ్నిప్రమాదం జరిగిందని గ్రహించిన స్థానికులు పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే దీపావళి పండగ సందర్బంగా అగ్నిప్రమాదం చోటు చేసుకోవడం కలకలం రేపింది. ఎలక్ట్రికల్ అండ్ హార్డ్ వేర్ షాఫులో మంగలు చెలరేగడంతో చుట్టుపక్కల ఉన్న నివాసాల్లోని వారు భయంతో రోడ్డు మీదకు వచ్చారు. కాగా ఈ ప్రమాదంలో భారీగానే ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది.