https://oktelugu.com/

అక్కినేని సమంత.. ‘కలర్’ ఫుల్ క్రిస్మస్..!

నేడు(డిసెంబర్ 25)న ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు సాదాసీదాగా జరుగుతున్నాయి. ప్రతీయేటా ఘనంగా జరిగే క్రిస్మస్ వేడుకలపై ఈసారి కరోనా.. కొత్త వైరస్ ప్రభావంగా బాగానే పడినట్లు కన్పిస్తోంది. యూరప్ దేశాల్లో క్రిస్మస్ వేడుకలు పూర్తిగా రద్దయింది. దీంతో యూరోపియన్లంతా ఈసారి కుటుంబ సభ్యులతోనే క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్నారు. ఇక భారత్ లో కరోనా నిబంధనలు పాటిస్తూ క్రిస్మస్ వేడుకలను క్రిస్టియన్లు జరుపుకుంటున్నారు. క్రిస్మస్ సందర్భంగా ప్రముఖులంతా ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే అక్కినేని సమంత మాత్రం […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 25, 2020 / 12:18 PM IST
    Follow us on

    నేడు(డిసెంబర్ 25)న ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు సాదాసీదాగా జరుగుతున్నాయి. ప్రతీయేటా ఘనంగా జరిగే క్రిస్మస్ వేడుకలపై ఈసారి కరోనా.. కొత్త వైరస్ ప్రభావంగా బాగానే పడినట్లు కన్పిస్తోంది.

    యూరప్ దేశాల్లో క్రిస్మస్ వేడుకలు పూర్తిగా రద్దయింది. దీంతో యూరోపియన్లంతా ఈసారి కుటుంబ సభ్యులతోనే క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్నారు. ఇక భారత్ లో కరోనా నిబంధనలు పాటిస్తూ క్రిస్మస్ వేడుకలను క్రిస్టియన్లు జరుపుకుంటున్నారు.

    క్రిస్మస్ సందర్భంగా ప్రముఖులంతా ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే అక్కినేని సమంత మాత్రం అదిరిపోయే డ్రెస్సులో క్రిస్మస్ వేడుకలను జరుపుకొని ఫ్యాన్స్ ను ఖుషీ చేసింది. ఈ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

    సమంత పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటిస్తూ ఫుల్ బీజీగా మారింది. ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ఆహా ఓటీటీలో సామ్ జామ్ అనే టాక్ షోలు చేస్తోంది. దీంతోపాటు ‘ది ఫ్యామిలీ మేన్ 2’ వెబ్ సిరీస్‌ చేస్తూ అభిమానులను అలరిస్తోంది.

    టాలీవుడ్లోకి ‘ఏం మాయ చేసావె’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సమంత ఆ తర్వాత నాగచైతన్యను పెళ్లి చేసుకొని అక్కినేని కోడలుగా మారింది. ఇక నేటి క్రిస్మస్ సంబరాల్లో కలర్ ఫుల్ డ్రెస్సులో కన్పించి అభిమానులను సైతం సమంతలో తన మాయలో పడేసింది.