ఠాక్రే ప్రతీకారం: అర్నబ్‌ గోస్వామి అరెస్ట్‌

మహారాష్ట్రలో కొలువుదీరిన శివసేన ఉద్దవ్ ఠాక్రే సర్కార్ ప్రతీకారం తీర్చుకుంది. సుశాంత్ సింగ్ మృతి కేసులో మహారాష్ట్ర సర్కార్ ను అభాసుపాలు చేసేలా సంచలన కథనాలు వండివార్చిన రిపబ్లిక్ టీవీ ఎడిటర్ అర్నాబ్ గోస్వామిని రెండేళ్ల కిందటి పాత కేసును తిరగదోడి మరీ అరెస్ట్ చేయడం దేశ మీడియా వర్గాల్లో సంచలనమైంది. మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్ ప్రముఖ జర్నలిస్ట్‌, రిపబ్లిక్‌ టీవీ ఎడిటర్‌‌ ఇన్‌ చీఫ్‌ అర్నబ్‌ గోస్వామి మరో వివాదంలో […]

Written By: NARESH, Updated On : November 4, 2020 1:16 pm
Follow us on

మహారాష్ట్రలో కొలువుదీరిన శివసేన ఉద్దవ్ ఠాక్రే సర్కార్ ప్రతీకారం తీర్చుకుంది. సుశాంత్ సింగ్ మృతి కేసులో మహారాష్ట్ర సర్కార్ ను అభాసుపాలు చేసేలా సంచలన కథనాలు వండివార్చిన రిపబ్లిక్ టీవీ ఎడిటర్ అర్నాబ్ గోస్వామిని రెండేళ్ల కిందటి పాత కేసును తిరగదోడి మరీ అరెస్ట్ చేయడం దేశ మీడియా వర్గాల్లో సంచలనమైంది.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్

ప్రముఖ జర్నలిస్ట్‌, రిపబ్లిక్‌ టీవీ ఎడిటర్‌‌ ఇన్‌ చీఫ్‌ అర్నబ్‌ గోస్వామి మరో వివాదంలో చిక్కుకున్నాడు. అర్నబ్ గోస్వామిపై ఇటీవల టీవీ టీఆర్పీ స్కామ్‌ కేసు నమోదైన సంగతి తెలిసిందే. గతంలో పాల్ఘర్ మూక హత్య కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో ఓ కేసు నమోదైంది. లాక్ డౌన్ సమయంలో ముంబైలోని బాంద్రా రైల్వే స్టేషన్‌కు భారీ ఎత్తున వలస కూలీలు చేరుకున్న సందర్భంలో మత విద్వేషాలు రెచ్చగొట్టేలా కథనాలు ప్రసారం చేశారన్న ఆరోపణలపై అర్నబ్‌పై కేసు నమోదైంది.

Also Read: బీహార్‌‌ ఎన్నికలు: మోడీ వరాలు.. అక్కడి ప్రజలు నమ్మేనా..!

తాజాగా.. అర్నబ్‌ను ముంబయి పోలీసులు అరెస్టు చేశారు. గోస్వామిని అరెస్టు చేసేందుకు ముందుగా ముంబయి పోలీసులు ఆయన ఇంటికి చేరుకున్నారు. అక్కడ ఇరువురి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన దృశ్యాలను రిపబ్లిక్ టీవీ ప్రసారం చేసింది. అరెస్ట్ అనంతరం అర్నబ్ గోస్వామి పోలీసులపై పలు ఆరోపణలు చేశారు. పోలీసులు తనతోపాటు తన భార్య, కుమారుడు, అత్తా-మామలపై కూడా భౌతిక దాడి చేశారని ఆరోపించారు.

ఈ అరెస్ట్‌ తీరుపై రిపబ్లికన్ టీవీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసులు దుందుడుకుగా వ్యవహరించారని.. ఓ టెర్రరిస్టునో లేదా హంతకుడినో అరెస్టు చేసినట్లుగా అర్నబ్‌ను అరెస్ట్ చేశారని ఆరోపించింది. అరెస్టు సమయంలో అర్నబ్‌ను పోలీసులు జుట్టు పట్టుకుని లాగారని.. భౌతిక దాడి చేశారని ఆరోపించింది.

Also Read: ఏపీ మహిళలకు జగన్ శుభవార్త.. ఆదాయం చేకూరేలా కీలక నిర్ణయం..?

అర్నబ్‌ను అరెస్ట్ చేయడానికి దాదాపు 20 నుంచి -30 మంది సాయుధ పోలీసులు వచ్చారని.. ఆయన్ను చుట్టుముట్టి బలవంతంగా పోలీస్ వ్యాన్ ఎక్కించారని రిపబ్లికన్ టీవీ జర్నలిస్ట్ ఒకరు ఆరోపించారు. పోలీసుల చేతుల్లో ఏకె-47 గన్స్ ఉన్నాయని.. ఒక జర్నలిస్టును అరెస్ట్ చేసేందుకు ఇంత హడావుడి ఎందుకని ప్రశ్నించారు. ఆయన్ను పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్న క్రమంలో.. మార్గమధ్యలో ఒక వ్యాను నుంచి మరో వ్యానులోకి ఎక్కించారని అన్నారు. పోలీసుల దౌర్జన్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. కాగా.. అర్నబ్‌ను రాయ్‌గఢ్ పోలీసులు అదుపులోకి తీసుకోగా.. ఆయనను ఏ కేసులో అరెస్ట్ చేశారన్న దానిపై ఇంకా స్పష్టత లేదు.