https://oktelugu.com/

శ్రీహరి విషయంలో ముందే చెప్పిన బాలయ్య.. ఎమోషనల్?

రియల్ హీరో శ్రీహరి టాలీవుడ్లో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇండస్ట్రీలో ఎలాంటి సపోర్టు లేకుండా పైకొచ్చిన నటుల్లో శ్రీహరి ఒకరు. శ్రీహరి కెరీర్ తొలినాళ్లలో విలన్ గా.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా.. కమెడియన్ చేశారు. డూప్ లేకుండానే యాక్షన్ సీన్ చేయడంలో శ్రీహరి దిట్ట. ఈ కారణంగానే శ్రీహరి టాలీవుడ్లో ‘రియల్ హీరో’గా పేరు తెచ్చుకున్నాడు. Also Read: మహేష్ దూకుడుకి ఎన్టీఆర్ చెక్..! శ్రీహరి చనిపోయిన చాలా ఏళ్లు గడుస్తున్నప్పటికీ అతడి జ్ఞాపకాలను పలువురు సెలబ్రెటీలు […]

Written By:
  • NARESH
  • , Updated On : October 28, 2020 / 02:32 PM IST
    Follow us on

    రియల్ హీరో శ్రీహరి టాలీవుడ్లో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇండస్ట్రీలో ఎలాంటి సపోర్టు లేకుండా పైకొచ్చిన నటుల్లో శ్రీహరి ఒకరు. శ్రీహరి కెరీర్ తొలినాళ్లలో విలన్ గా.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా.. కమెడియన్ చేశారు. డూప్ లేకుండానే యాక్షన్ సీన్ చేయడంలో శ్రీహరి దిట్ట. ఈ కారణంగానే శ్రీహరి టాలీవుడ్లో ‘రియల్ హీరో’గా పేరు తెచ్చుకున్నాడు.

    Also Read: మహేష్ దూకుడుకి ఎన్టీఆర్ చెక్..!

    శ్రీహరి చనిపోయిన చాలా ఏళ్లు గడుస్తున్నప్పటికీ అతడి జ్ఞాపకాలను పలువురు సెలబ్రెటీలు ఏదో ఒక సందర్భంలో గుర్తు చేసుకుంటున్నారు. తాజాగా నందమూరి బాలకృష్ణ సైతం శ్రీహరిపై ఎమోషన్ కామెంట్స్ చేశారు. ఇటీవలే బాలకృష్ణ నటించిన ‘నర్తనశాల’ సినిమాను శ్రేయాస్ ఈటీ ద్వారా ఎన్బీకే థియేటర్లో విడుదల అయింది. ఈ సినిమా ద్వారా వచ్చిన కలెక్షన్లలో కొంత భాగం సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగించనున్నట్లు బాలకృష్ణ ప్రకటించాడు.

    ‘నర్తనశాల’ సినిమాలో బాలకృష్ణ అర్జునుడిగా నటించాడు. నటి సౌందర్య ద్రౌపదిగా నటించగా భీముడిగా శ్రీహరి.. ధర్మరాజుగా శరత్ కుమార్ నటించారు. తాజాగా బాలకృష్ణ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ శ్రీహరినే భీముడిగా ఎందుకు తీసుకున్నామనే విషయాన్ని వెల్లడించారు. శ్రీహరిని భీముడి పాత్రకు ఎంపిక చేయడానికి అతడి టాలెంటే కారణమని చెప్పాడు. కొందరికి టాలెంట్ ఉంటే ఫిజిక్ ఉండదని.. ఫిట్నెస్ ఉంటే టాలెంట్ ఉండదన్నారు. శ్రీహరికి ఈ రెండు సమపాళ్లలో ఉన్నాయని బాలకృష్ణ తెలిపాడు.

    17ఏళ్ల క్రితం ఈ నిర్మించిన ఈ మూవీలోని జ్ఞాపకాలు ఇంకా గుర్తున్నాయని తెలిపాడు. తనకు ఇండస్ట్రీలో చాలా తక్కువమంది స్నేహితులు ఉన్నారని అందులో శ్రీహరి ఒకరని బాలయ్య చెప్పారు. శ్రీహరి చాలా మంచి మనిషి.. ఎదుటి మనిషిని ఎంతగానో గౌరవిస్తారని.. తనకు చాలా దగ్గరి ఆత్మ బంధువు అంటూ బాలకృష్ణ చాలా ఎమోషనల్ అయ్యాడు.

    Also Read: షాకింగ్.. రేటు పెంచి డిస్కౌంట్ ఇచ్చిన రష్మిక..!

    రాణా సినిమా టైంలో కేశవ పాత్ర చేస్తే నీ కెరీర్ మారుతుందని శ్రీహరికి చెప్పనని.. ఆ తర్వాత అతడు హీరోగా సక్సస్ అయ్యాడని బాలయ్య తెలిపాడు. శ్రీహరి వద్దకు ఎవరైనా అవకాశం కోసం వస్తే మీరు వెళ్లి బాలకృష్ణ దృష్టిలో పడండి అంటూ చెప్పేవారని గుర్తు చేసుకున్నాడు. బాలయ్య అవకాశం ఇస్తే మీ జీవితమే మారిపోతుని చెప్పేవాడని తెలిపారు. అది శ్రీహరి మంచితనమని.. ఎదుటి వ్యక్తిని ఎలా గౌరవించాలో తెలిసిన మనస్సున్న వ్యక్తి శ్రీహరి అంటూ బాలయ్య వ్యాఖ్యానించాడు.