దుబ్బాక ఎన్నిక ఓట్ల లెక్కంపు మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. పొన్నాల ఇందూరు కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రంలో అధికారులు 14 టేబుళ్లను ఏర్పాటు చేశారు. 23 రౌండ్లలో, 5 వీవీ ప్యాట్లలోని స్లిప్పులను లెక్కిస్తారు. కౌంటింగ్ ఏర్పాట్లకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ తెలిపారు. కౌంటింగ్ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించామన్నారు. మధ్యాహ్నం 12 లోగా ఫలితం తేలే అవకాశం ుంది. ఈనెల 3న 315 పోలింగ్ కేంద్రాల్లో 1,64,186 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 82.61 శాతం పోలింగ్ నమోదైంది.