
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా, రాహుల్ గాంధీ, రాష్ట్ర ఇన్‌చార్జ్ ఠాగూర్‌కి ఎమ్మెల్యే జగ్గారెడ్డి లేఖ రాశారు. పీసీసీ ఎన్నికపై తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దని లేఖలో పేర్కొన్నారు. సాగర్ ఉప ఎన్నిక వరకు ఉత్తమ్ కుమార్ రెడ్డినే కొనసాగించాలని కోరారు. పీసీసీ ఎన్నికపై సీనియర్ కాంగ్రెస్ నేతల అభిప్రాయాలు తీసుకోవాలని సూచించారు. ఏకాభిప్రాయంతోనే పీసీసీ చీఫ్ ఎన్నిక జరగాలని ఎమ్మెల్యే జగ్గారెడ్డి లేఖలో పేర్కొన్నారు.