ఇల్లు లేని వారికి కేంద్రం బంపర్ ఆఫర్.. హోమ్ లోన్ తీసుకుంటే రూ.2.67 లక్షలు తగ్గింపు..?

మనలో చాలామంది సొంతింటి కలను సాకారం చేసుకోవాలని అనుకుంటూ ఉంటారు. అయితే రోజురోజుకు ఇనుము, సిమెంట్, ఇసుక, లేబర్ ఖర్చులు పెరుగుతుండటంతో ఎక్కువ మొత్తం డబ్బు ఉంటే మాత్రమే సొంతింటి కలను నెరవేర్చుకోవడం సాధ్యమవుతోంది. కరోనా, లాక్ డౌన్ వల్ల ఈ ఏడాది ఇళ్ల కొనుగోళ్లు భారీగా తగ్గాయి. ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు ఏర్పడుతున్న నేపథ్యంలో కేంద్రం అమలు చేస్తున్న ఒక స్కీమ్ ద్వారా హోమ్ లోన్ పై తగ్గింపు, ఇతర ప్రయోజనాలను పొందవచ్చు. Also Read: […]

Written By: Kusuma Aggunna, Updated On : December 26, 2020 3:44 pm
Follow us on


మనలో చాలామంది సొంతింటి కలను సాకారం చేసుకోవాలని అనుకుంటూ ఉంటారు. అయితే రోజురోజుకు ఇనుము, సిమెంట్, ఇసుక, లేబర్ ఖర్చులు పెరుగుతుండటంతో ఎక్కువ మొత్తం డబ్బు ఉంటే మాత్రమే సొంతింటి కలను నెరవేర్చుకోవడం సాధ్యమవుతోంది. కరోనా, లాక్ డౌన్ వల్ల ఈ ఏడాది ఇళ్ల కొనుగోళ్లు భారీగా తగ్గాయి. ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు ఏర్పడుతున్న నేపథ్యంలో కేంద్రం అమలు చేస్తున్న ఒక స్కీమ్ ద్వారా హోమ్ లోన్ పై తగ్గింపు, ఇతర ప్రయోజనాలను పొందవచ్చు.

Also Read: ఎస్బీఐ కస్టమర్లకు శుభవార్త.. ఇంటి నుంచే డబ్బులు వేసే, తీసే ఛాన్స్..?

2015 సంవత్సరం జూన్ నెల 25వ తేదీ నుంచి కేంద్ర ప్రభుత్వం ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన పేరుతో ఒక స్కీమ్ ను అమలు చేస్తోంది. ఈ స్కీమ్ ద్వారా పక్కా ఇల్లు లేని వారు వడ్డీ రాయితీ రుణం పొందే అవకాశం ఉంటుంది. దేశంలో 2022 సంవత్సరానికి గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రజలు పక్కా ఇళ్లలో ఉండాలనే ఉద్దేశంతో కేంద్రం ఈ స్కీమ్ ను అమలు చేస్తోంది. పక్కా ఇళ్లు లేని వాళ్లు ఈ స్కీమ్ కు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

తక్కువ ఆదాయం ఉన్నవారు, ఆర్థికంగా వెనుకబడిన వారు, మధ్యతరగతి వారు ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కేంద్రం మూడు లక్షల కంటే ఆదాయం తక్కువగా ఉంటే అర్థికంగా వెనుకబడిన వారిగా, 3 లక్షల నుంచి 6 లక్షల మధ్య ఆదాయం ఉన్నవారు తక్కువ ఆదాయం ఉన్నవారిగా, 6 లక్షల నుంచి 18 లక్షల మధ్య ఆదాయం ఉన్నవారు మధ్య తరగతి వారిగా పరిగణిస్తోంది.

Also Read: భారతదేశంలో డ్రైవర్ లేని ట్రైన్.. ఎక్కడ రాబోతుందంటే..?

https://pmaymis.gov.in/open/check_aadhar_existence.aspx?comp=b వెబ్ సైట్ ద్వారా ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. బ్యాంకులో హోమ్ లోన్ కోసం దరఖాస్తు చేసుకునే వాళ్లు లోన్ తీసుకునే సమయంలో ప్రభుత్వ సబ్సిడీకి సంబంధించిన దరఖాస్తు తీసుకోవాలి. సబ్సిడీకి మీరు అర్హులు అయితే ఆ సబ్సిడీ మొత్తం బ్యాంకుకు అందుతుంది. సమీపంలోని బ్యాంకును సంప్రదించి ఈ స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

6 లక్షల రూపాయల లోపు ఆదాయం ఉంటే రూ.2.67 లక్షలు, 6 నుంచి 12 లక్షల మధ్య ఆదాయం ఉంటే రూ.2.35 లక్షలు, 18 లక్షల వరకు ఆదాయం ఉంటే రూ. 2.30 లక్షలు సబ్సిడీ కింద పొందవచ్చు. సబ్సిడీ పోను మిగిలిన రుణాన్ని ఈ.ఎం.ఐల రూపంలో చెల్లించాల్సి ఉంటుంది.