
బేగంపేటలో బాలీవుడ్ నటుడు సోనుసూద్ సందడి చేశారు. తన పేరు పెట్టుకుని హోటల్ నడుపుతున్న ఓ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌ను సోనుసూద్ సందర్శించి నిర్వాహకులను ఉత్సాహపరిచారు. గతంలో చైనా ఫుడ్‌సెంటర్ అని ఉండడంతో కరోనా నేపథ్యంలో ఆదాయం పడిపోయింది. నష్టాలు రావడంతో నిర్వాహకుడు అనిల్‌కు కొత్త ఆలోచన పుట్టింది. లాక్‌డౌన్‌లో పేదలకు అండగా నిలిచిన సోనుసూద్ పేరును ఉపయోగించుకుని లక్ష్మీ సోనుసూద్ ఫాస్ట్‌పుడ్ సెంటర్ అని పేరు మార్చి ఫ్లెక్సీలు వేశాడు. దీంతో మళ్లీ గిరాకీ పెరిగింది. ఈ విషయం ఆ నోట ఈ నోట.. మొత్తం మీద సోషల్ మీడియాలో హల్‌చల్ కావడంతో సోనుసూద్ తెలుసుకుని నేరుగా ఫాస్ట్‌పుడ్ సెంటర్‌ను సందర్శించారు. దీంతో నిర్వాహకులు ఆనందంలో మునిగిపోయారు.