https://oktelugu.com/

మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కరోనా

తెలంగాణలో మరో ఎమ్మెల్యే కరోనా బారిన పడ్డాడు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ ఇటీవల నీరసంగా ఉండడంతో కరోనా టెస్టు చేయించుకున్నారు. దీంతో ఆయకు పాజిటివ్ రిపోర్టు వచ్చింది. ప్రస్తుతం తాను ఆరోగ్యంగానే ఉన్నందువల్ల హోం క్వారంటైన్ లో ఉన్నానని తెలిపారు. అయితే నాలుగురోజులుగా తనతో సన్నిహితంగా ఉన్నవారు అవసరమైతే కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కాగా ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు కరోనా బారిన పడ్డా చికిత్స తీసుకొని కోలుకున్నారు. మరోవైపు రాష్ట్రంలో శీతాకాలం ప్రభావంతో కరోనా […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : December 23, 2020 / 02:21 PM IST
    Follow us on

    తెలంగాణలో మరో ఎమ్మెల్యే కరోనా బారిన పడ్డాడు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ ఇటీవల నీరసంగా ఉండడంతో కరోనా టెస్టు చేయించుకున్నారు. దీంతో ఆయకు పాజిటివ్ రిపోర్టు వచ్చింది. ప్రస్తుతం తాను ఆరోగ్యంగానే ఉన్నందువల్ల హోం క్వారంటైన్ లో ఉన్నానని తెలిపారు. అయితే నాలుగురోజులుగా తనతో సన్నిహితంగా ఉన్నవారు అవసరమైతే కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కాగా ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు కరోనా బారిన పడ్డా చికిత్స తీసుకొని కోలుకున్నారు. మరోవైపు రాష్ట్రంలో శీతాకాలం ప్రభావంతో కరోనా కేసులు పెరుగుతున్నారు. వారం రోజుల కిందట కరోనా కేసులు తగ్గినా రెండు మూడు రోజుల నుంచి కేసుల్లో పెరుగుతల కనిపిస్తోంది.