burned
యువతిని హత్య చేసిన కాల్చి చంపిన సంఘటన అనంతపురం జిల్లాలో కలకలం రేపింది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ధర్మవరం మండలం బడన్నపల్లి వద్ద ఓ యువతి మ్రుతదేహం లభ్యమైంది. ఆ మ్రుతదేహం పాక్షికంగా తగలబడిపోవడంతో ఆమెను హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. అయితే సంఘటనా స్థలంలో ఐడీ కార్డు లభించడంతో ఆమె పేరు స్నేహ లత అని, ఎస్బీఐ బ్యాంకులో పనిచేస్తుందని గుర్తించారు. ఆమె నిత్యం ధర్మవరం నుంచి అనంతపురం వచ్చి బ్యాంకులో పనిచేసేదని, ఆమెను కొందరు యువకులే హత్య చేశారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.