కలెక్టరేట్ల భవన నిర్మాణాలు పూర్తి: మంత్రి ప్రశాంత్ రెడ్డి
తెలంగాణలో కొత్త జిల్లాలు ఏర్పాటైన స్థానాల్లో కలెక్టరేట్ల భవన నిర్మాణాలు పూర్తయ్యాయయని, వాటిని ఈనెలలోనే సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని మంత్రి వేమలు ప్రశాంత్ రెడ్డి తెలిపారు. మరికొన్ని నిర్మాణంలో ఉన్నాయని వాటిని త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ఆదివారం ఆయన యాదాద్రి ఆలయ పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వీవీఐపీ విల్లాలు, పుష్కరిణి, కల్యాణ కట్ట పనులను పరిశీలించారు. ఈ పనులను ఈనెలలో పూర్తి చేయాలని ఆదేశించారు. యాదాద్రి పరిసరాలు పచ్చదనంతో […]
తెలంగాణలో కొత్త జిల్లాలు ఏర్పాటైన స్థానాల్లో కలెక్టరేట్ల భవన నిర్మాణాలు పూర్తయ్యాయయని, వాటిని ఈనెలలోనే సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని మంత్రి వేమలు ప్రశాంత్ రెడ్డి తెలిపారు. మరికొన్ని నిర్మాణంలో ఉన్నాయని వాటిని త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ఆదివారం ఆయన యాదాద్రి ఆలయ పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వీవీఐపీ విల్లాలు, పుష్కరిణి, కల్యాణ కట్ట పనులను పరిశీలించారు. ఈ పనులను ఈనెలలో పూర్తి చేయాలని ఆదేశించారు. యాదాద్రి పరిసరాలు పచ్చదనంతో కళకళలాడాలని సూచించారు.