రైతులకు మోదీ సర్కార్ శుభవార్త.. ఏం చెప్పారంటే..?

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలోని రైతులకు శుభవార్త చెప్పారు. చెరుకు పండించే రైతులకు ప్రయోజనం చేకూరేలా నిర్ణయం తీసుకున్నారు. దేశంలో ఉత్తరాది రాష్ట్రాలతో పాటు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో సైతం చెరుకును విరివిగా పండిస్తారనే విషయం విదితమే. ఈ క్రమంలో కేంద్ర కేబినెట్ చెరుకు రైతుల కోసం కీలక ప్రకటన చేసింది. చక్కెర నుంచి తీసే ఇథనాల్ కు కేంద్రం ధరను ఖరారు చేసింది. చెరుకు నుంచి తయారయ్యే చక్కెర నుంచి తీసిన ఇథనాల్ ను కేంద్ర […]

Written By: Kusuma Aggunna, Updated On : October 29, 2020 6:58 pm
Follow us on


ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలోని రైతులకు శుభవార్త చెప్పారు. చెరుకు పండించే రైతులకు ప్రయోజనం చేకూరేలా నిర్ణయం తీసుకున్నారు. దేశంలో ఉత్తరాది రాష్ట్రాలతో పాటు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో సైతం చెరుకును విరివిగా పండిస్తారనే విషయం విదితమే. ఈ క్రమంలో కేంద్ర కేబినెట్ చెరుకు రైతుల కోసం కీలక ప్రకటన చేసింది. చక్కెర నుంచి తీసే ఇథనాల్ కు కేంద్రం ధరను ఖరారు చేసింది.

చెరుకు నుంచి తయారయ్యే చక్కెర నుంచి తీసిన ఇథనాల్ ను కేంద్ర కేబినేట్ మూడు గ్రేడులుగా విభజించింది. ప్రభుత్వ రంగ ఏఎంసీలకు ఇథనాల్ సరఫరా కోసం ప్రభుత్వం ఖరారు చేసిన ధరలు అమలులోకి రానున్నాయి. కేంద్ర కేబినెట్ ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ ప్రోగ్రాం ద్వారా ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల నుంచి ఇథనాల్ ను సేకరించేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. రూ. 62.65, రూ. 57.61, రూ. 45.69 గా ప్రభుత్వం ధరలను నిర్ణయించింది.

మోదీ సర్కార్ దేశంలో పెట్రోల్ వినియోగాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో ఇథనాల్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తోంది. విదేశాలపై పెట్రోల్ కోసం ఆధారపడుతున్న స్థితిని క్రమంగా తగ్గించే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. కేంద్ర కేబినెట్ ఈ నిర్ణయంతో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 736 ఆనకట్టల భద్రత, నిర్వహణ పనితీరు మెరుగుపరచటం కోసం మోదీ సర్కార్ ఫేస్ 2, ఫేస్ 3 లను ఆమోదించింది.

కేంద్ర మంత్రి వర్గం ప్యాకేజింగ్ కోసం జనపనార పదార్థాలను వినియోగించాలని చెబుతూ అందుకు తగిన విధంగా నిబంధనలలో కీలక మార్పులు చేసింది. ఆహార పదార్థాలను 100కు 100 శాతం జనపనార సంచులలోనే ప్యాక్ చేయాలని తెలిపింది.