ఎన్నికల తర్వాత కేసీఆర్‌ ఆలోచనలో మార్పు వచ్చింది..

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మరోసారి ఫైర్‌ అయ్యారు. ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్ ఈ రెండు కూడా ప్రజలచే, పన్నుల రూపేణా వచ్చిన సొమ్ముతో అమలు చేయబడుతున్నాయని తెలిపారు. ఆయుష్మాన్ భారత్ వినియోగించుకోవడం ప్రజలందరి హక్కు అని స్పష్టం చేశారు. ఎన్నికల అనంతరం సీఎం కేసీఆర్‌ ఆలోచనలో మార్పు వచ్చిందని.. అక్రమ సంపాదన కాపాడుకోవడానికి మోడీకి రాష్ట్ర భవిష్యత్తును పణంగా పెడుతున్నాడని ఫైర్‌ అయ్యారు జీవన్‌రెడ్డి. ప్రభుత్వం చెప్పిన ప్రకారం ధాన్యం కొనుగోలు కేంద్రాలతో […]

Written By: Suresh, Updated On : December 31, 2020 6:20 pm
Follow us on

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మరోసారి ఫైర్‌ అయ్యారు. ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్ ఈ రెండు కూడా ప్రజలచే, పన్నుల రూపేణా వచ్చిన సొమ్ముతో అమలు చేయబడుతున్నాయని తెలిపారు. ఆయుష్మాన్ భారత్ వినియోగించుకోవడం ప్రజలందరి హక్కు అని స్పష్టం చేశారు. ఎన్నికల అనంతరం సీఎం కేసీఆర్‌ ఆలోచనలో మార్పు వచ్చిందని.. అక్రమ సంపాదన కాపాడుకోవడానికి మోడీకి రాష్ట్ర భవిష్యత్తును పణంగా పెడుతున్నాడని ఫైర్‌ అయ్యారు జీవన్‌రెడ్డి. ప్రభుత్వం చెప్పిన ప్రకారం ధాన్యం కొనుగోలు కేంద్రాలతో పడుతున్న భారం ఎకరానికి రూ.500 లు మాత్రమేనని… తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో రైతుల భాగస్వామ్యం లేదా అని ప్రశ్నించారు. ధాన్యం సేకరణతో ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతుందంటున్న కేసీఆర్‌కు… ముఖ్యమంత్రిగా కొనసాగే నైతిక హక్కు లేదని మండి పడ్డారు.