https://oktelugu.com/

విద్యార్థులకు క్రెడిట్ కార్డులు ఇస్తున్న ప్రముఖ బ్యాంకులు.. ఎలా పొందాలంటే..?

దేశంలో క్రెడిట్ కార్డుల వినియోగం అంతకంతకూ పెరుగుతోంది. ఉద్యోగులు, వ్యాపారులు ఎక్కువగా క్రెడిట్ కార్డులను వినియోగిస్తున్నారు. అయితే విద్యార్థులకు కూడా ప్రముఖ ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలకు చెందిన బ్యాంకులు క్రెడిట్ కార్డులను ఆఫర్ చేస్తున్నాయి. ఈ క్రెడిట్ కార్డులను తీసుకోవడం ద్వారా విద్యార్థులకు అత్యవసర ఖర్చులకు ఆ డబ్బు ఉపయోగపడుంది. Also Read: జియో కస్టమర్లకు బంపర్ ఆఫర్.. ఉచితంగా వాయిస్ కాల్స్..? సాధారణంగా బ్యాంకులు ఎవరికైతే స్థిర ఆదాయం ఉంటుందో వారికి మాత్రమే క్రెడిట్ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 1, 2021 1:02 pm
    Follow us on

    Student Credit Card
    దేశంలో క్రెడిట్ కార్డుల వినియోగం అంతకంతకూ పెరుగుతోంది. ఉద్యోగులు, వ్యాపారులు ఎక్కువగా క్రెడిట్ కార్డులను వినియోగిస్తున్నారు. అయితే విద్యార్థులకు కూడా ప్రముఖ ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలకు చెందిన బ్యాంకులు క్రెడిట్ కార్డులను ఆఫర్ చేస్తున్నాయి. ఈ క్రెడిట్ కార్డులను తీసుకోవడం ద్వారా విద్యార్థులకు అత్యవసర ఖర్చులకు ఆ డబ్బు ఉపయోగపడుంది.

    Also Read: జియో కస్టమర్లకు బంపర్ ఆఫర్.. ఉచితంగా వాయిస్ కాల్స్..?

    సాధారణంగా బ్యాంకులు ఎవరికైతే స్థిర ఆదాయం ఉంటుందో వారికి మాత్రమే క్రెడిట్ కార్డులను మంజూరు చేస్తాయి. అయితే విద్యార్థులందరూ క్రెడిట్ కార్డును పొందలేరు. విద్యార్థులు ఎవరైతే 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉంటారో వారు మాత్రమే క్రెడిట్ కార్డును పొందేందుకు అర్హులు. బ్యాంకులు విద్యార్థులకు సాధారణ వడ్డీరేటుతో పోలిస్తే తక్కువ వడ్డీరేటుకే రుణాలను ఇస్తుండటం గమనార్హం.

    Also Read: 2020కి బైబై చెప్పేసిన న్యూజిలాండ్..!

    గరిష్టంగా 5 సంవత్సరాల కాలపరిమితితో బ్యాంకులు క్రెడిట్ కార్డులను మంజూరు చేస్తున్నాయి. ప్రస్తుతం కళాశాలలో చదువుతున్న విద్యార్థులు మాత్రమే క్రెడిట్ కార్డును తీసుకోవచ్చు. ఎస్బీఐ, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంకులు విద్యార్థులకు క్రెడిట్ కార్డులను ఆఫర్ చేస్తున్నాయి. ఈ కార్డులకు 15 వేల రూపాయల వరకు లిమిట్ ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్, కాలేజీ ఐడీ కార్డ్, ఇంటి అడ్రస్ తో కూడిన గుర్తింపు కార్డు, పాన్ కార్డ్ జిరాక్సులతో పాటు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు ఇచ్చి ఈ క్రెడిట్ కార్డును పొందవచ్చు.

    మరిన్ని వార్తల కోసం: ప్రత్యేకం

    కొన్ని బ్యాంకులు ఈ సర్వీసులను ఆన్ లైన్ లో అందిస్తుండగా మరికొన్ని బ్యాంకులు మాత్రం ఆఫ్ లైన్ లో అందిస్తున్నాయి. బ్యాంకును బట్టి క్రెడిట్ కార్డ్ అర్హతలు, ప్రయోజనాల విషయంలో మార్పులు ఉంటాయి. బ్యాంకులు నిర్ణయించిన అర్హత ప్రమాణాలు ఉన్న విద్యార్థులు మాత్రమే ఈ కార్డులను పొందవచ్చు.