జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా టీఆర్ఎస్ మెనీఫెస్టో విడుదలపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి విమర్శల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ విడుదల చేసిన మెనిఫెస్టో 2016 నాటిదన్నారు. సెలూన్లు, దోభీ ఘాట్లకు ఉచిత విద్యుత్ అని గతంలోనే చెప్పారన్నారు. గత ఆరున్నరేళ్లుగా వరద నీటి నిర్వహణ పనులు చేపట్టలేదన్నారు. ఎంఎంటీఎస్ విస్తరణ, తక్కువ ధరలకే ప్రయాణం అని చెబుతున్నారని, ఎంఎంటీఎస్ పపనులను రైల్వే చేపడుతుందని కొంత వాటా రాష్ట్రం […]
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా టీఆర్ఎస్ మెనీఫెస్టో విడుదలపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి విమర్శల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ విడుదల చేసిన మెనిఫెస్టో 2016 నాటిదన్నారు. సెలూన్లు, దోభీ ఘాట్లకు ఉచిత విద్యుత్ అని గతంలోనే చెప్పారన్నారు. గత ఆరున్నరేళ్లుగా వరద నీటి నిర్వహణ పనులు చేపట్టలేదన్నారు. ఎంఎంటీఎస్ విస్తరణ, తక్కువ ధరలకే ప్రయాణం అని చెబుతున్నారని, ఎంఎంటీఎస్ పపనులను రైల్వే చేపడుతుందని కొంత వాటా రాష్ట్రం ఇస్తుందన్నారు. ట్రాఫిక్ ఫ్రీ నగరం అని చెబుతున్న ప్రభుత్వం అలాంటి పరిస్థితులు నగరంలో ఉన్నాయో లేవో నగర్ ప్రజలకు తెలుసన్నారు.