వన్ ప్లస్ ఫోన్ ఫ్రీగా పొందే ఛాన్స్.. ఎలా అంటే..?

ప్రముఖ స్మార్ట్ కంపెనీలలో ఒకటైన వన్ ప్లస్ ఉచితంగా స్మార్ట్ ఫోన్ ను పొందే అవకాశం కల్పిస్తోంది. తాజాగా వన్ ప్లస్ 9 సిరీస్‌ను మన దేశ మార్కెట్ లో లాంఛ్ చేసింది. వన్‌ప్లస్ 9 సిరీస్‌లో వన్‌ప్లస్ 9, వన్‌ప్లస్ 9 ప్రో, వన్‌ప్లస్ 9 ఆర్‌ ఫోన్లు మార్కెట్ లోకి అందుబాటులోకి వచ్చాయి. కొత్త స్మార్ట్ ఫోన్లను విడుదల చేసినట్లు ప్రకటించిన వన్ ప్లస్ సంస్థ అమెజాన్ లో ప్రత్యేకమైన క్విజ్ ను సైతం […]

Written By: Kusuma Aggunna, Updated On : March 25, 2021 11:12 am
Follow us on

ప్రముఖ స్మార్ట్ కంపెనీలలో ఒకటైన వన్ ప్లస్ ఉచితంగా స్మార్ట్ ఫోన్ ను పొందే అవకాశం కల్పిస్తోంది. తాజాగా వన్ ప్లస్ 9 సిరీస్‌ను మన దేశ మార్కెట్ లో లాంఛ్ చేసింది. వన్‌ప్లస్ 9 సిరీస్‌లో వన్‌ప్లస్ 9, వన్‌ప్లస్ 9 ప్రో, వన్‌ప్లస్ 9 ఆర్‌ ఫోన్లు మార్కెట్ లోకి అందుబాటులోకి వచ్చాయి. కొత్త స్మార్ట్ ఫోన్లను విడుదల చేసినట్లు ప్రకటించిన వన్ ప్లస్ సంస్థ అమెజాన్ లో ప్రత్యేకమైన క్విజ్ ను సైతం నిర్వహిస్తూ ఉండటం గమనార్హం.

Also Read: మీ జీమెయిల్ స్టోరేజ్ ఫుల్ అయిందా.. ఏం చేయాలంటే..?

ఈ క్విజ్ లో ఎవరైతే సరైన సమాధానలు చెబుతారో వారిలో కొందరికి వన్ ప్లస్ సంస్థ ఏప్రిల్ నెల 16వ తేదీన ఉచితంగా కొత్త స్మార్ట్ ఫోన్లను అందిస్తుంది. నేటి నుంచి వచ్చే నెల 15 వరకు ఈ క్విజ్ ఉంటుంది. ఈ క్విజ్ కేవలం యాప్ లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. వెబ్ సైట్ తో లాగిన్ కావడం ద్వారా ఈ క్విజ్ కోసం రిజిష్టర్ చేసుకోవడం సాధ్యం కాదు. సమాధానాలు చెప్పాలంటే కచ్చితంగా అమెజాన్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

Also Read: ఎయిర్‌టెల్‌ యూజర్లకు అలర్ట్.. జాగ్రత్తగా ఉండమంటున్న పోలీసులు..?

మరోవైపు ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ కస్టమర్లకు అదిరిపోయె ఇ శుభవార్త చెప్పింది. ఎంపిక చేసిన స్మార్ట్ ఫోన్లపై భారీగా డిస్కౌంట్ ను ప్రకటించింది. ఫ్యాబ్‌ ఫోన్స్‌ ఫెస్ట్ పేరుతో సేల్ ను తీసుకోచ్చి స్మార్ట్ ఫోన్ ఫోన్ ను కొనుగోలు చేయాలనుకునే వాళ్లకు భారీ డిస్కౌంట్ ను అందిస్తోంది. ఎంపిక చేసిన స్మార్ట్‌ ఫోన్లపై 40 శాతం వరకు డిస్కౌంట్‌ పొందే అవకాశం ఉండగా అదనంగా మరో 10 శాతం డిస్కౌంట్ ను కూడా పొందవచ్చు.

రేపటి వరకు ఈ సేల్ అందుబాటులో ఉండటంతో స్మార్ట్ ఫోన్లు కొనుగోలు చేయాలనుకునే వాళ్లు వెంటనే ఫోన్ ను కొనుగోలు చేస్తే మంచిది. వన్‌ప్లస్‌ 8 ప్రో 5 జీ ఫోన్ పై ఏకంగా అమెజాన్ 14,000 రూపాయలు ఎక్స్ ఛేంజ్ పొందే అవకాశం ఉంటుంది.