వాహనదారులలో చాలామంది భౌతికంగా డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారనే సంగతి తెలిసిందే. అయితే డ్రైవింగ్ లైసెన్స్ యొక్క స్మార్ట్ కాఫీని సులభంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. భారత ప్రభుత్వం స్పెషల్ ఆప్షన్ ద్వారా డిజి లాకర్ లేదా పరివాహన్ యాప్ లో లైసెన్స్ ను పొందడానికి అవకాశం కల్పిస్తోంది. డ్రైవింగ్ లైసెన్స్ సాఫ్ట్ కాపీ లేకపోతే ఈ ఆప్షన్ సహాయపడుతుంది.

డ్రైవింగ్ లైసెన్స్ ను పోగొట్టుకున్న వాళ్లు సైతం ఈ విధంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలీసుల తనిఖీ సమయంలో లైసెన్స్ ను చూపించవచ్చు. గతంలో కేంద్ర ప్రభుత్వం డిజి లాకర్ లేదా పరివాహన్ యాప్స్ లలో స్టోర్ చేసిన వాహన రిజిస్ట్రేషన్ తో పాటు డ్రైవింగ్ లైసెన్స్ ను ఆమోదించాలని వెల్లడించింది. ఈ మార్గాలను అనుసరించడం ద్వారా సులభంగా డ్రైవింగ్ లైసెన్స్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
ఇందుకోసం మొదట ఫోన్ నంబర్ మరియు ఆధార్ కార్డ్ ను ఉపయోగించి డిజి లాకర్ యాప్ ను ఓపెన్ చేయాలి. అందులో యూజర్ ఐడీతో పాటు ఆరు అంకెల పిన్ ను ఎంటర్ చేసి సైన్ అప్ చేయాలి. ఆ తరువాత సైన్ ఇన్ చేసి వన్ టైమ్ పాస్ వర్డ్ ను ఎంటర్ చేయాలి. అనంతరం గెట్ ఇష్యూడ్ డాక్యుమెంట్స్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత సెర్చ్ బార్ లో డ్రైవింగ్ లైసెన్స్ అని సెర్చ్ చేయాలి.
ఆ తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ ను పొందే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎంచుకోవాలి. ఆ తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ నంబర్ ను ఎంటర్ చేసి గెట్ డాక్యుమెంట్ బటన్ ను క్లిక్ చేయాలి. ఈ విధంగా సులభంగా డ్రైవింగ్ లైసెన్స్ ను పొందే అవకాశం అయితే ఉంటుంది.