దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. పెట్రోల్, డీజిల్ లను జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే వీటి ధరలు తగ్గుతాయని ప్రజలు భావించినా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించడానికి సుముఖంగా లేవు. ప్రజలలో చాలామంది ఎలక్ట్రిక్ స్కూటర్లను వినియోగించడానికి ఆసక్తి చూపిస్తున్నా తగినన్ని ఛార్జింగ్ స్టేషన్లు లేకపోవడం వల్ల సమస్య ఎదురవుతోంది.

కొత్త స్కూటర్ ఖరీదు ఎక్కువ కావడంతో చాలామంది సెకండ్ హ్యాండ్ స్కూటర్లపై ఆసక్తి చూపిస్తున్నారు. సెకండ్ హ్యాండ్ స్కూటర్లను విక్రయించే బైక్ 24 కేవలం 30,000 రూపాయలకే టీవీఎస్ స్కూటర్ ను అందిస్తోంది. టీవీఎస్ వెగో షోరూమ్ ధర 55,098 రూపాయలు కాగా ఈ స్కూటర్ లో 110 సీసీ ఇంజిన్ ఉంది. లీటర్ పెట్రోల్ కు 48 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే ఈ స్కూటర్ ను బైక్ 24 ద్వారా కొనుగోలు చేయవచ్చు.
2013 మోడల్ స్కూటర్ అయిన ఈ స్కూటర్ ఢిల్లీ ఆర్టీవోలో నమోదు కావడంతో పాటు ఇప్పటివరకు 53,000 కిలోమీటర్లు నడిచింది. స్కూటర్ నచ్చకపోతే 7 రోజుల్లో రిటర్న్ ఇచ్చి మనీ బ్యాక్ పొందవచ్చు. ఈ స్కూటర్ లో డిస్క్, డ్రమ్ సిస్టమ్ ఉంటుంది. బైక్ 24 వెబ్‌సైట్‌ని సందర్శించడం ద్వారా ఈ స్కూటర్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందని సమాచారం.
సెకండ్ హ్యాండ్ స్కూటర్ ను కొనుగోలు చేయాలని అనుకునే వాళ్లకు ఈ స్కూటర్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. బైక్ 24 వెబ్ సైట్ నిర్వాహకులు ఈ స్కూటర్ లో ఎటువంటి ఇబ్బందులు లేవని ధృవీకరించడం గమనార్హం.