Yamaha zumo 125 cc: పట్టణాలు, నగరాల్లో ఉండే వారి రోజువారి అవసరాల కోసం చిన్న స్కూటర్ కొనుగోలు చేయాలని చూస్తుంటారు. ఇలాంటి వారి కోసం ఎలక్ట్రిక్ వాహనాలు ఎంతో అనుగుణంగా ఉంటున్నాయి. అయితే కొత్తలో ఓలా, either వంటి స్కూటర్లు ఎక్కువగా కొనుగోలు చేసేవారు. ఆ తర్వాత ప్రముఖ కంపెనీలు సైతం ఇదే స్టైల్ లో వినియోగదారులకు అనుగుణంగా వాహనాలను తీసుకువస్తున్నారు. తాజాగా Yamaha కంపెనీకి చెందిన.. అర్బన్ స్కూటర్ చూడడానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా.. ఇంధన సామర్థ్యం మెరుగ్గా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఇందులో ఉండే ఫీచర్లు కూడా సిటీలో ఉండే వారికి కంఫర్టబుల్గా ఉండడంతో చాలామంది దీనిని కొనుగోలు చేయాలని చూస్తున్నారు. ఈ బైక్ వివరాల్లోకి వెళితే..
సాధారణంగా సిటీలో ఉండేవారు స్మూత్ రోడ్లపై ఎక్కువగా రైడ్ చేస్తారు. కానీ యమహా నుంచి మార్కెట్లోకి వచ్చిన Yamaha Zuma 125 అనే స్కూటర్ కఠినమైన రోడ్లపై కూడా వెళ్లేందుకు అనుగుణంగా దీని టైర్లను డిజైన్ చేశారు. వెడల్పుగా ఉండే టైర్లు, హాయ్ మౌంటెడ్ బాడీ పానెల్ ఉండడంతో.. ఎటువంటి రహదారుల పైన అయినా ఈజీగా వెళ్లే విధంగా డ్రైవింగ్ ఉంటుంది. ఇందులో 125 సిసి 4 స్ట్రోక్ లిక్విడ్ కూల్డ్ ఇంజన్ ను సెట్ చేశారు. ఇది ఫోర్ వాల్వ్ తో పాటు సమర్థవంతంగా డెలివరీ కావడానికి ఉపయోగపడుతుంది. గమ్యానికి చేరుకోవడానికి అనుగుణంగా ఇంజన్ ఉండడంతో సిటీలో ఏ మూలకైనా వెళ్లడానికి ఇది సహాయపడుతుంది. ఇందులో హైడ్రాలిక్ డిస్క్ బ్రేక్ ను అమర్చారు. దీంతో ట్రాఫిక్ లో ఇబ్బంది లేకుండా ఆగడం.. త్వరగా వెళ్లడానికి అనుగుణంగా ఉంటుంది. టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్ తో ఉండడంతో.. కంఫర్టబుల్ గా రైడ్ చేయవచ్చు. అలాగే ఇందులో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఉండడంతో సులభంగా డ్రైవ్ చేయవచ్చు.
ఈ బైక్ చూడడానికి ఆకాశంగా ఉంటుంది. ఎల్ఈడి హెడ్లైట్ తో పాటు ట్రైల్ లైట్ కూడా ఉండడంతో రాత్రి సమయంలో కూడా దూర ప్రాంతాన్ని కవర్ చేస్తుంది. అలాగే ఇందులో ఇండికేటర్ లైట్స్, పెట్రోల్ ఇండికేటర్ సూచించే లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన ఎల్సిడి మీటర్ ఉండనుంది. దీనిలో అమర్చిన ఫ్యూయల్ ట్యాంక్ వాతావరణం లో పొల్యూషన్ కాకుండా ఉంటుంది. ఇది చూడడానికి చిన్న స్కూటర్ లా అనిపించినా.. సీటింగ్ మాత్రం వెడల్పుగా ఉండి ఫ్యామిలీ సైతం వెళ్లేలా ఉంటుంది. నగరంలో అనుకున్న సమయానికి అనుకున్న చోటుకు వెళ్లడానికి నాణ్యమైన డ్రైవింగ్ కోరుకునే వారికి ఈ బైక్ కచ్చితంగా నచ్చుతుంది.