Old is Gold Days: సాంకేతికంగా చాలా అభివృద్ధి సాధించాం. అరచేతిలో ప్రపంచాన్ని చూస్తున్నాం. ఒక క్లిక్ దూరం లో ఏం కావాలో కాళ్ల దగ్గరికి తెచ్చుకుంటున్నాం. ఈ అభివృద్ధిని చూస్తే గొప్పగా అనిపిస్తుంది. కానీ వీటి కంటే ముందు మనం ఎక్కడి నుంచి వచ్చామో అనే విషయాలను ఒకసారి నెమరు వేసుకుంటే.. ఆనందంగా ఉంటుంది. అరచేతిలో ప్రపంచాన్ని చూస్తున్న ఈ కాలంలో మనం చాలా టెక్నాలజీ వస్తువులను దాటుకొని వచ్చాం. ఇంతకీ అవి ఏంటో ఒకసారి చూద్దామా..
1.టెలిఫోన్ బూత్ లు
రెండు దశాబ్దాలు వెనక్కి వెళ్తే గ్రామంలో ని వీధుల్లో ఎస్.టి.డి/ ఐ ఎస్ డి/ లోకల్ అని పేరుతో పసుపు రంగు టెలిఫోన్ బూత్ లు ఉండేవి. ఎవరితోనైనా ఫోన్లో మాట్లాడాలంటే కచ్చితంగా అక్కడికి వెళ్లాల్సిందే. ఇక ఆ ఫోన్ బాక్సులలో ఎర్రటి డిజిటల్ మీటర్ ఉండేది. చూస్తుండగానే సెకండ్లు గడిచి పోతుండేవి. బిల్లు ఏ స్థాయిలో వస్తుందోనని భయం కూడా చాలామందిలో ఉండేది.
2.నోకియా ఫోన్ల సంచలనం
భారతీయ టెలికాం ఇండస్ట్రీలో నోకియా ఫోన్లు ఒక సంచలనం. అప్పట్లో ప్రతి ఇంట్లో ఫోన్ ఉండేది కాదు. ఒకవేళ ఎవరి దగ్గరైనా ఫోన్ గనుక ఉండి ఉంటే అది కచ్చితంగా నోకియా కంపెనీ తయారు చేసింది అయి ఉండేది. ఆ ఫోన్లో చాలామంది స్నేక్ గేమ్, క్రికెట్ గేమ్ ఆడేవారు. విభిన్నమైన రింగ్ టోన్లు పెట్టుకునేవారు. ఆ ఫోన్లు అద్భుతమైన సామర్ధ్యం ఉండేవి. ఒకవేళ కింద పడిపోయిన అవి ధ్వంసమయ్యేవి కాదు.
3.రీఛార్జ్ కూపన్లు
నేటి కాలంలో ఫోన్ రీఛార్జ్ ప్రస్తుతం ఫోన్ పే, గూగుల్ పే, ఇతర వాటి ద్వారా చేస్తున్నాం. కానీ ఒకప్పుడు దుకాణాలకు వెళ్లి రీఛార్జి కార్డులు కొనుగోలు చేయాల్సి వచ్చేది. వాటి వెనుక ఉన్న 16 అంకెల కోడ్ ను గీ కాల్సి వచ్చేది. ఒకవేళ 16 అంకెల కోడ్ లో ఒక్క అంకె పోయినా సరే ఇబ్బందిగా ఉండేది.
4.3g డాంగిల్స్
ఇంటర్నెట్ సౌకర్యం అప్పట్లో అంతంతమాత్రంగానే ఉండేది. మొబైల్ డాటా కూడా పరిమితంగా ఉండేది. ఆ సమయంలో లాప్టాప్ లకు ఇంటర్నెట్ కోసం 3జి డాంగిల్స్ తగిలించేవారు. అవి వెలుగుతూ ఉంటేనే ఇంటర్నెట్ వచ్చేది. ఒకవేళ సిగ్నల్ గనక తగ్గితే.. లాప్టాప్ ను కిటికీల దగ్గరికి.. బిల్డింగ్ ల పైకి తీసుకెళ్లేవారు.
5.కాయిన్ బాక్స్
అప్పట్లో ఫోన్ కాల్స్ మాట్లాడేవారు రూపాయి కాయిన్ బాక్స్ ల వద్దకు వెళ్లేవారు. అందులో రూపాయి కాయిన్ వేయగానే ఒకరకమైన శబ్దం వచ్చేది. పరిమితి అయిపోతున్నప్పుడు బీప్ సౌండ్ వచ్చేది.