https://oktelugu.com/

షావోమీ కస్టమర్లకు గుడ్ న్యూస్.. రిపబ్లిక్ డే భారీ డిస్కౌంట్ ఆఫర్లు..?

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షావోమి వినియోగదారులకు శుభవార్త చెప్పింది. రిపబ్లిక్ డే సందర్భంగా బంపర్ ఆఫర్ ను ప్రకటించింది. ఇప్పటికే ప్రముఖ ఈకామర్స్ కంపెనీలు రిపబ్లిక్ డే సేల్ ను ప్రకటించగా షావోమీ కూడా ఆ జాబితాలో చేరింది. షావోమి రిపబ్లిక్ డే సేల్ ఈ నెల 20వ తేదీన ప్రారంభం కానుండగా ఈ నెల 24వ తేదీ వరకు సేల్ జరగనుంది. ఎంఐ వీఐపీ క్లబ్ మెంబర్ షిప్ ఉన్నవాళ్లు మాత్రం ఈరోజు […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 19, 2021 / 06:44 PM IST
    Follow us on


    ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షావోమి వినియోగదారులకు శుభవార్త చెప్పింది. రిపబ్లిక్ డే సందర్భంగా బంపర్ ఆఫర్ ను ప్రకటించింది. ఇప్పటికే ప్రముఖ ఈకామర్స్ కంపెనీలు రిపబ్లిక్ డే సేల్ ను ప్రకటించగా షావోమీ కూడా ఆ జాబితాలో చేరింది. షావోమి రిపబ్లిక్ డే సేల్ ఈ నెల 20వ తేదీన ప్రారంభం కానుండగా ఈ నెల 24వ తేదీ వరకు సేల్ జరగనుంది. ఎంఐ వీఐపీ క్లబ్ మెంబర్ షిప్ ఉన్నవాళ్లు మాత్రం ఈరోజు నుంచే ఫోన్లు కొనుగోలు చేయవచ్చు.

    Also Read: వాట్సాప్ కు కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక.. అసలేం జరిగిందంటే..?

    మి.కామ్ ద్వారా స్మార్ట్ ఫోన్ యూజర్లు మొబైల్ ఫోన్లను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఈ సేల్ ద్వారా రెడ్‌మి 9 ఐ, రెడ్‌మి 9 ప్రైమ్, రెడ్‌మి నోట్ 9 సిరీస్ స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేయవచ్చు. ఎంఐ వాచ్ రివాల్వ్, ఎంఐ స్మార్ట్ బ్యాండ్ 4, రెడ్‌మి స్మార్ట్ బ్యాండ్ కొనుగోలుపై కూడా తగ్గింపు అమలవుతోంది. యాక్సిక్ బ్యాంకు క్రెడిట్ కార్డ్ ఉన్నవారికి 10 శాతం అదనంగా క్యాష్ బ్యాక్ ను పొందే అవకాశం ఉంటుంది.

    Also Read: బీఎస్ఎన్‌ఎల్ కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త.. ఏమిటంటే..?

    రెడ్‌మి 9 ఐ 4 జీబీ + 64 జిబి స్టోరేజ్ మోడల్ పై 300 రూపాయలు, రెడ్‌మి 9 ప్రైమ్ 4 జీబీ + 64 జీబీ స్టోరేజ్ మోడల్ పై 500 రూపాయలు, రెడ్‌మి నోట్ 9 6 జీబీ + 128 జిబి స్టోరేజ్ వేరియంట్ పై 1,000 రూపాయలు, రెడ్‌మి నోట్ 9 ప్రో 4 జీబీ + 128 జీబీ స్టోరేజ్ ఫోన్ కొనుగోలుపై 2000 రూపాయలు, రెడ్‌మి నోట్ 9 ప్రో మాక్స్ 6 జిబి + 64 జీబీ స్టోరేజ్ పై డిస్కౌంట్ ను పొందే అవకాశం ఉంటుంది.

    మరిన్ని వార్తల కోసం: వ్యాపారము

    ఎంఐ ఎల్‌ఈడీ స్మార్ట్ టీవీల కొనుగోలుపై 1,000 రూపాయల డిస్కౌంట్ ను పొందే అవకాశం ఉంటుంది. ఎంఐ స్మార్ట్ వాటర్ ప్యూరిఫైయర్ (ఆర్‌ఓ+యువి) కొనుగోలు చేయడం ద్వారా 3,000 రూపాయల వరకు డిస్కౌంట్ ను పొందవచ్చు