https://oktelugu.com/

పాపం రాత్రులు తెగ కష్టపడిపోతుందట !

బాలీవుడ్ బ్యూటీ ‘అలియా భట్’ గత కొన్ని సంవత్సరాలుగా నాన్ స్టాప్ గా సినిమాలు చేసుకుంటూ పోతుంది. ఒక సినిమా షూటింగ్ షెడ్యూలు పూర్తి కాగానే మరో సినిమా షూటింగ్ అంటూ ఎక్కడా గ్యాప్ లేకుండా వర్క్ చేసుకుంటూ పోతుంది. పైగా ఒక సినిమా షూటింగ్ హైద్రాబాద్ లో జరిగితే.. మరో సినిమా ముంబైలో జరుగుతుంది. దీనికితోడు ఇంకో మూవీ ఢిల్లీలో జరుగుతుంది. అన్నిటికి మించీ అన్ని పెద్ద సినిమాలే. దానికితోడు పెద్ద దర్శకులు పెద్ద హీరోలే. […]

Written By:
  • admin
  • , Updated On : January 19, 2021 / 06:44 PM IST
    Follow us on


    బాలీవుడ్ బ్యూటీ ‘అలియా భట్’ గత కొన్ని సంవత్సరాలుగా నాన్ స్టాప్ గా సినిమాలు చేసుకుంటూ పోతుంది. ఒక సినిమా షూటింగ్ షెడ్యూలు పూర్తి కాగానే మరో సినిమా షూటింగ్ అంటూ ఎక్కడా గ్యాప్ లేకుండా వర్క్ చేసుకుంటూ పోతుంది. పైగా ఒక సినిమా షూటింగ్ హైద్రాబాద్ లో జరిగితే.. మరో సినిమా ముంబైలో జరుగుతుంది. దీనికితోడు ఇంకో మూవీ ఢిల్లీలో జరుగుతుంది. అన్నిటికి మించీ అన్ని పెద్ద సినిమాలే. దానికితోడు పెద్ద దర్శకులు పెద్ద హీరోలే.

    Also Read: ‘చిరు – చరణ్’ సీన్స్ కు రంగం సిద్ధం !

    అయితే, కోవిడ్ 19 సంక్షోభం తర్వాత షూటింగ్ లు అన్ని ఒకేసారి మొదలవ్వగానే మేకర్స్ అందరూ ఆలియా డేట్స్ కోసం తొందరపడుతున్నారు. ముందుగా “బ్రహ్మాస్త్ర” సినిమా షూటింగ్ కోసం ఫుల్ డేట్స్ ఇచ్చి.. ఆ సినిమాని స్పీడ్ గా పూర్తి చేసింది. ఆ తర్వాత సంజయ్ లీలా భన్సాలీ తీస్తున్న “గంగూబాయి” సినిమా షూటింగ్ లో జాయిన్ అయింది. ప్రస్తుతం కూడా “గంగూబాయి” షూటింగ్ తో ఫుల్ బిజీగా ఉంది. పైగా గత పదిరోజుల నుండి ఈ సినిమాకే డేట్స్ ను కేటాయించి మరీ పని చేసింది.

    Also Read: ‘ఆర్‌ఆర్‌ఆర్’లో ట్రైబ్ గా యంగ్ కమెడియన్ !

    అలాగే మధ్యలో అనగా గత నెలలో రాజమౌళి మూవీ “ఆర్ ఆర్ ఆర్” షూటింగ్ కి వచ్చింది. ఆ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని మళ్లీ మరో బాలీవుడ్ మూవీకి డేట్స్ ఇచ్చింది. అయితే ఆ సినిమా షూటింగ్ ఎక్కువుగా నైట్ టైంలోనే జరగడంతో మొత్తానికి ఆలియా ఆరోగ్యం అప్ సెట్ అయింది. పైగా డే టైంలో “గంగూబాయి” సినిమా కోసం పని చేస్తోంది. ఆదివారం సెట్ లో కళ్ళు తిరిగి పడిపోవడంతో ముంబైలోని ఆసుపత్రిలో చేర్చారట. ఒక రోజులోనే ఆమె రికవర్ కావడంతో డిశ్చార్జ్ కూడా చేశారు. పాపం రాత్రులు కూడా అలియా తెగ కష్టపడిపోతుంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం బాలీవుడ్ న్యూస్