XChat coming soon : సైన్స్ అండ్ టెక్నాలజీలో కొత్త కొత్త ఆవిష్కరణలు వస్తుంటాయి. ఉన్న ఆవిష్కరణలు మరింత నూతనత్వాన్ని సంపాదించుకుంటాయి. అప్పటిదాకా ప్రొవైడ్ చేస్తున్న సర్వీస్ కు మరింత నవీనతనాన్ని అందించి అలరిస్తాయి. అందుకే ప్రపంచ వ్యాప్తంగా సైన్స్ అండ్ టెక్నాలజీ అంతకంతకు విస్తరిస్తోంది. ఏటి కేడు అభివృద్ధి చెందుతూ సరికొత్త ఆవిష్కరణలను తెరపైకి తెస్తోంది. తద్వారా మనిషి జీవితానికి మరింత సుఖవంతమైన అనుభూతిని అందిస్తోంది.. భవిష్యత్ కాలంలో సైన్స్ అండ్ టెక్నాలజీ మరింత డెవలప్ అయ్యి.. వినూత్నమైన ఉత్పత్తులను తెరపైకి తీసుకొచ్చే అవకాశం ఉంది.
సోషల్ మీడియాలో ఇప్పుడు ఎన్నో యాప్స్ అందుబాటులో ఉన్నప్పటికీ.. ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్, ట్విట్టర్ సృష్టిస్తున్న సంచలనం అంతా ఇంతా కాదు. ఈ మూడు యాప్స్ లో ప్రపంచప్తంగా కోట్ల మంది వాడుతున్నారు. ఇక మెసేజింగ్ యాప్ గా వాట్సప్ ప్రాచుర్యాన్ని పొందింది. ఇప్పటికే వినియోగదారులకు రకరకాల సౌకర్యాలు అందుబాటులోకి తీసుకువచ్చి.. నెంబర్ వన్ మెసేజింగ్ యాప్ గా కొనసాగుతోంది. అయితే ఈ యాప్ కు ఇప్పుడు తీవ్రమైన పోటీ ఎదురు కాబోతోంది. భవిష్యత్తు కాలంలో తీవ్రమైన ప్రతిఘటన చోటు చేసుకోబోతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద మెసేజింగ్ అప్లికేషన్ తో పాటు.. మిగతా యాప్స్ కూడా కష్ట కాలాన్ని ఎదుర్కోబోతున్నాయి.
కొన్నేళ్ళ క్రితం ప్రపంచ శ్రీమంతుడు మస్క్ ట్విట్టర్ ను కొనుగోలు చేశాడు. ఆ తర్వాత అందులో రకరకాల మార్పులకు శ్రీకారం చుట్టాడు. ఉద్యోగులను తొలగించాడు. రెవెన్యూ పెంచుకోవడానికి రకరకాల మార్గాలను అన్వేషించాడు. అయితే ఇప్పుడు మస్క్ సరికొత్త ప్రణాళికలను రూపొందిస్తున్నాడు. ఎందుకంటే ట్విట్టర్ ను ఎక్స్ గా మార్చిన అతడు.. త్వరలోనే ఎక్స్ చాట్ ను అందుబాటులోకి తీసుకురానున్నాడు. ఎక్స్ చాట్ లో డిసప్పీయరింగ్ సందేశాలు, ఎండ్ టు ఎండ్ ఎన్ క్రిప్సన్, ఫైల్ షేరింగ్, ఆడియో, వీడియో కాల్స్ వంటి సదుపాయం ఉంటుంది. టెస్టింగ్ కోసం ఈ యాప్ ను పరిమిత యూజర్లకు మాత్రమే పరిమితం చేశారు. వచ్చేకాలంలో ఇది వాట్సాప్, ఇన్ స్టా గ్రామ్, టెలిగ్రామ్ వంటి సంస్థలకు పోటీ అవుతుందని తెలుస్తోంది.
“మస్క్ మరో ప్రయోగాన్ని చేపట్టాడు. తన సంస్థకు ఆదాయాన్ని సంపాదించుకోవడానికి రూపకల్పన చేశాడు. ఇది ఎంతవరకు దారితీస్తుందో తెలియదు. కాకపోతే ప్రపంచ శ్రీమంతుడు కాబట్టి ఎలాంటి మార్పులకైనా అదుపు సిద్ధంగా ఉంటాడు. ఆదాయాన్ని సంపాదించడంలో అతడు ముందు వరుసలో ఉంటాడు. అందువల్లే ఇలాంటి ప్రయోగాలకు శ్రీకారం చుడుతున్నాడు. మెసేజింగ్ యాప్ లలో నెంబర్ వన్ గా ఉన్న ఇతర సంస్థలను అతడు గట్టిగానే టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది. అందువల్లే తెరపైకి కొత్త కొత్త పద్ధతులను తీసుకొస్తున్నాడు. ఇప్పటికైతే ఇవి ప్రయోగ దశలో ఉన్నాయి. ఒకవేళ అవి గనుక విజయవంతం అయితే మార్కెట్ లో మస్క్ రాణిస్తాడా.. మిగతావాళ్లు అతడి దూకుడును తట్టుకుంటారా.. అనే ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలని” టెక్ నిపుణులు చెబుతున్నారు.