Thug Life Movie Review : ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో కమల్ హాసన్ కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఆయన నుంచి వచ్చిన సినిమాలు ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా ఆయనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని కూడా క్రియేట్ చేసి పెడుతున్నాయి… ప్రస్తుతం మణిరత్నం (Manirathnam) దర్శకత్వంలో ఆయన చేసిన ‘థగ్ లైఫ్ ‘ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది ప్రేక్షకులను మెప్పించిందా? లేదా అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
కథ
ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే రంగరాయా శక్తి వేల్ (Kamal Hasan) మాఫియా సామ్రాజ్యాన్ని ఏలుతూ ఉంటాడు. ఇక అతనికి పోటీగా మాణిక్యం తన బిజినెస్ లను కొనసాగించుకుంటూ ఉంటాడు. మరి ఈ క్రమంలోనే మాణిక్యం ఒకరోజు రంగరాయ శక్తి వేల్ మీద కాల్పులు జరుపుతాడు. ఈ సందర్భంలో అతనిని అమరన్ (శింబు) అనే ఒక కుర్రాడు కాపాడుతాడు. రంగరాయ ఆ పిల్లాడిని తన సొంత కొడుకులా భావించి పెంచుకుంటాడు.
మరి ఈ క్రమంలోనే అతను పెరిగి పెద్దయిన తర్వాత రంగరాయా కి అమరన్ కి మధ్య కొన్ని విభేదాలైతే వస్తాయి. ఒకరిని ఒకరు చంపుకునెంత శత్రుత్వాన్ని పెంచుకుంటారు. ఇక ఈ క్రమంలో వీళ్లిద్దరి మధ్య ఏం జరిగింది. ఎవరు ఎవరిని చంపారు అనే విషయం తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…
విశ్లేషణ
ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే ఒకప్పుడు టాప్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న మణిరత్నం (Manirathnam) ఈ మధ్యకాలంలో చేసిన సినిమాలతో ఏమాత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోతున్నాడు. పోనియన్ సెల్వన్ మొదటి పార్ట్, రెండో పార్ట్ భారీ అంచనాలతో ప్రేక్షకులు ముందుకు వచ్చినప్పటికి ఆ సినిమాలను తెలుగులో పెద్దగా ఆదరించలేకపోయారు. తమిళంలో కొంతవరకు పర్లేదు అనిపించుకున్నప్పటికి తెలుగు ప్రేక్షకులకు మాత్రం ఆ సినిమా ఏమి అర్థం కాకపోవడంతో ఎందుకు ఈ సినిమా చేశారు అనే ఒక డైలమాలో అయితే ప్రేక్షకులు ఉన్నారు. ఇక మొత్తానికైతే ఈ సినిమాలో కమల్ హాసన్ ను డిఫరెంట్ గా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం అయితే చేశాడు.తమ నటనతో ఒక అద్భుతమైన శక్తిగా కమల్ హాసన్ కనిపించాడు. వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఇంతకుముందు వచ్చిన నాయకుడు సినిమాను మించి ఈ సినిమాలో కమల్ హాసన్ నటన అయితే ఉంది…
మణిరత్నం ఫస్టాఫ్ ని ఎంగేజింగ్ గా హ్యాండిల్ చేసినప్పటికి సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి కొంతవరకు తడబడ్డట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాని ఎలా డ్రైవ్ చేయాలి ఎటు నుంచి ఎటు తీసుకెళ్లాలి అనే విషయంలో ఆయన కొంతవరకు క్లారిటీ మిస్ అయ్యాడనే విషయమైతే ఈ సినిమా చూస్తే మనకు చాలా స్పష్టంగా తెలుస్తోంది. శింబు క్యారెక్టర్ ని తీర్చిదిద్దిన విధానం బాగుంది కానీ ఇంతకుముందు ఇతర సినిమాల్లో చూసిన పాత్రల మాదిరిగానే అతనికి రొటీన్ స్టోరీ ని పెట్టడం వల్ల ఈ సినిమా మీద పెద్దగా కొత్త సీన్స్ అయితే లేకుండా పోయాయి… మణిరత్నం కమల్ హాసన్ కాంబో మీద ప్రేక్షకులకు మంచి అంచనాలైతే ఉన్నాయి. కాబట్టి ఆ అంచనాలకు రీచ్ అయ్యే విధంగా ఈ సినిమా లేకపోవడం కొంతవరకు కన్ఫ్యూజన్ తో కూడిన స్క్రీన్ ప్లే రాయడం వల్ల ఈ సినిమాకి కొంత మైనస్ గా అయితే మారింది.
మాఫియా సామ్రాజ్యం అనేది చాలా బాగా ఎస్టాబ్లిష్ చేసినప్పటికి అందులోని పాత్రలను సరిగ్గా డీల్ చేయలేకపోవడమే ఈ సినిమాకి భారీ మైనస్ అయిందని తెలుస్తోంది..రెహమాన్ మ్యూజిక్ కూడా సో సో గానే ఉంది. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో కొంతవరకు కేర్ తీసుకున్నప్పటికి సినిమాలోని కోర్ ఎమోషన్ ను పండించడంలో రెహమాన్ కొంతవరకు తన బ్యాగ్రౌండ్ తో సహకరించాడనే చెప్పాలి…
ఆర్టిస్టుల పర్ఫామెన్స్
ఇక ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే లోకనాయకుడు కమల్ హాసన్ తన గత చిత్రాల మాదిరిగానే అద్భుతమైన ప్రదర్శనను కనబరిచాడు. ఆయన నటన కోసమైన ఈ సినిమా చూడొచ్చు అనేంత రేంజ్ లో నటించి మెప్పించాడు. ముఖ్యంగా ఫస్టాఫ్ లో వచ్చే కొన్ని సీన్స్ లో ఆయన అద్భుతంగా నటించాడు. కమల్ హాసన్ లాంటి నటుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మరెవరు లేరు అనేంతల నటించి మెప్పించాడు. ఇక శింబు కూడా తన పాత్ర పరిధి మేరకు చాలా అద్భుతంగా నటించాడు. ఒకానొక సందర్భంలో కమల్ హాసన్ తో పోటీపడి మరి నటించి తన పరిణితిని చూపించాడు. త్రిష కూడా సినిమా స్టోరీలో భాగం కావడం ఆమె పాత్రకి మంచి స్కోప్ ఉండడం వల్ల ఆమె కూడా సినిమాలో హైలైట్ గా నిలిచింది. ఇక అభిరామి పాత్ర కూడా చాలా బాగుంది… మిగతా ఆర్టిస్టులందరు వాళ్ళ పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు…
టెక్నికల్ అంశాలు
ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే ఏ ఆర్ రెహమాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా కొన్ని సీన్స్ లో మాత్రం ఆయన ఇచ్చిన బ్యా గ్రౌండ్ స్కోర్ సినిమాకి చాలా బాగా హెల్ప్ అయింది. ఇక క్లైమాక్స్ లో ఆయన ఇచ్చిన వయోలిన్ మ్యూజిక్ అద్భుతంగా ఉంది… సినిమాటోగ్రఫీ కూడా ఈ సినిమాకి చాలా బాగా హెల్ప్ అయింది. మణిరత్నం సినిమా అంటే సినిమాటోగ్రఫీ బాగుంది. ఆ విజువల్స్ అండ్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయనే విషయం మనకు తెలిసిందే. దానికి తగ్గట్టుగానే ఈ సినిమాలో కూడా చాలా ఎక్స్ట్రాడినరీ విజువల్స్ ను స్క్రీన్ మీద ప్రజెంట్ చేసే ప్రయత్నం అయితే చేశారు…
ప్లస్ పాయింట్స్
ఫస్టాఫ్
కమల్ హాసన్ యాక్టింగ్
క్లైమాక్స్
మైనస్ పాయింట్స్
కథ
అనవసరపు సీన్స్
కొన్ని లాజిక్స్ మిస్సయ్యాయి…
రేటింగ్
ఈ సినిమాకి మేమిచ్చే రేటింగ్ 2.25/5