Wooden Satellite: శాస్త్రసాంకేతికరగంలో ప్రపంచం దూసుకుపోతోంది. సృష్టి రహస్యాలను తెలుసుకునేందుకు వాతావరణ, పర్యావరణం, ప్రమాదాలను పసిగట్టేందకు అధునాతన ఉపగ్రహాలను ప్రపంచ దేశాలు ప్రయోగిస్తున్నాయి. ఇలా ప్రయోగిస్తున్న ఉప గ్రహాలన్నీ లోహాలతోనే తయారు చేస్తున్నారు. అయితే వీటి కాల పరిమితి ముగిసిన తర్వాత, పొరపాటున ఏదైనా ప్రమాదానికి గురైతే.. అక్కడే చెత్తగా మిగిలిపోతున్నాయి. ఈ వ్యర్థాలు ఇతర ఉపగ్రహాలకు, అంతరిక్ష నౌకకు ప్రమాదకరంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో వ్యర్థాల సమస్యకు చెక్ పెట్టేలా జపాన్ శాస్త్రవేత్తలు సరికొత్త ఉపగ్రమాన్ని అభివృద్ధి చేశారు.
చెక్కతో ఉపగ్రహం..
జపాన్ పరిశోధకులు ప్రపంచంలోనే తొలిసారి లిగ్నోశాట్ అనే చిన్న ఉపగ్రహ ఆన్ని చెక్కతో అభివృద్ధి చేశారు. దీనిని సెప్టెంబర్‌లో అంతరిక్షంలోకి ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ లిగ్నోశాట్‌ను టోక్కో విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు లాగింగ్ కంపెనీ సుమిటోమో ఫారెస్ట్రీ సహకారంతో రూపొందించింది.
2020లో శ్రీకారం..
జపాన్ పరిశోధకులు ఈ ప్రాజెక్టుకు 2020 ఏప్రిల్‌లోనే శ్రీకారం చుట్టారు. దీని తయారీకి మాగ్నోలియా కలపను ఎంచుకున్నారు. ఈ చెక్క ఉపగ్రహాలు అంతరిక్షంలోని వ్యర్థాల సమస్యలకు శాశ్వతమైన పరిష్కారం చూపుతాయని జపాన్ పరిశోధకులు చెబుతున్నారు. ఇక చెక్కను ఉపగ్రహంలా మలిచేలా ప్రతివైపు పది సెంటిమీటర్లు ఉండేలా అడ్జెస్ట్ చేశారు. దీనిని సెప్టెంబర్లో కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి స్పేస్ ఎక్స్ రాకెట్లో ప్రయోగించనున్నారు. అక్కడ నుంచి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్(ఐఎస్‌ఎస్)కి డెలివరీ చేస్తారు.
అనేక సమస్యలకు పరిష్కారం..
ఈ ఉపగ్రహం బలాన్ని, ఉష్ణోగ్రత హెచ్చు తగ్గులను తట్టుకునే సామర్థ్యం ఉందా లేదా వంటి అపలు టెస్టులు చేస్తారు. అందుకోసం డేటాను పంపించి విశ్లేషిస్తామని సుమిటో ఫారెస్ట్రీ ప్రతినిధి తెలిపారు. ఈ సరికొత్త చెక్క ఉపగ్రహం అంతరిక్ష వ్యర్థాలపై పోరాటంలో కీలక ముందడుగని పేర్కొన్నారు. ఇది విజయవంతమైతే కొత్తతరం పర్యావరణ అనకూల ఉపగ్రహాలను తయారు చేసేలా ఈ లిగ్నోశాట్ ఉపగ్రహం మార్గం సుగమం చేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.