Girls: ఇలాంటి లక్షణాలు మీకు ఉన్నాయా? అయితే అమ్మాయిలు అసలు ఇష్టపడరు..

చిన్న చిన్న విషయాలకు కోపానికి రావడం, చిరాకు పడటం. ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం వంటి లక్షణాలు ఉంటే కూడా అమ్మాయిలకు నచ్చదట. కోపం వల్ల ఎన్నో బంధాలు విడిపోతుంటాయి. సో కూల్ గా ఉండటం బెటర్.

Written By: Swathi Chilukuri, Updated On : May 31, 2024 12:02 pm

Girls

Follow us on

Girls: పెళ్లి అంటే అమ్మాయిలు ఎప్పటి నుంచో కలలు కంటూనే ఉంటారు. నాకు కాబోయే భర్త అలా ఉండాలి. ఇలా ఉండాలి అని ఊహించుకుంటారు. హైట్, వెయిట్, కలర్, క్యారెక్టర్, జీతం అంటూ వారి జీవితాన్ని కల్ల ముందు చూసుకుంటారు. అయితే కొన్ని లక్షణాలు స్పెషల్ గా అనుకుంటారు. కొందరికి హెయిర్ స్టైల్, కొందరికి డ్రెస్ సెన్స్, మరికొందరికి టాకింగ్ పవర్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. కాని కొన్ని లక్షణాలు ఉండే అబ్బాయిలను మాత్రం అమ్మాయిలు అసలు ఇష్టపడరట. ఇంతకీ అవేంటి అంటే..

అతి జాగ్రత్త: మనం చెప్పుకుంటాం కదా అతి సర్వత్రా వర్జయేత్ అని.. జాగ్రత్త కూడా అతిగా ఉన్నా అబ్బాయి అమ్మాయికి నచ్చరట. అవసరానికి మించి ఎక్కువ జాగ్రత్తలు తీసుకున్నా కూడా అది అమ్మాయిలకు నచ్చదు. వారి స్వేచ్ఛను కోల్పోయినట్టు ఫీల్ అవుతారట. ఇలాంటి వారిని అమ్మాయి, అబ్బాయి ఇద్దరు కూడా ఇష్టపడరట.

కోపం: చిన్న చిన్న విషయాలకు కోపానికి రావడం, చిరాకు పడటం. ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం వంటి లక్షణాలు ఉంటే కూడా అమ్మాయిలకు నచ్చదట. కోపం వల్ల ఎన్నో బంధాలు విడిపోతుంటాయి. సో కూల్ గా ఉండటం బెటర్.

బద్దకం: బద్దకం ఎక్కువగా ఉండే అబ్బాయిలని అమ్మాయిలు ఇష్టపడరు. ఏ పని చెప్పినా చేయకుండా తర్వాత చేస్తాను అంటూ వాయిదాలు వేస్తూ ఆ పనిని పట్టించుకోకుండా, అమ్మాయిని కూడా పట్టించుకోకుండా బద్దకంగా ఉండే అబ్బాయిలను పెళ్లి కాదు కదా ప్రేమించడానికి కూడా ఇష్టపడరట అమ్మాయిలు.

పనుల్లో షేరింగ్ లేకపోవడం: ఇంటి పని మొత్తం తన మీదనే వదిలేసి కాస్త కూడా సహాయం చేయకుండా నెగ్లెట్ గా ఉంటే కూడా నచ్చదట. హాలీడేస్ లో కూడా ఖాళీగా కూర్చుంటూ కనీస సహాయం చేయకపోతే వారికి నచ్చదట. తర్వాత పిల్లలు, ఇంటి పనులు అంటూ తన ఎంత బాధ్యతను మోయాలో తెలుసు కాబట్టి జాగ్రత్త పడతారట.

గొప్పలు చెప్పుకోవడం: పదే పదే గొప్పలు చెప్పుకునే వారిని కూడా ఇష్టపడరట అమ్మాయిలు. నార్మల్ గా చెప్పడం వేరు. పదే పదే చిరాకు తెప్పించేలా చెప్పడం వేరు కాబట్టి ఇలాంటి లక్షణాలు కూడా ఎక్కువ ఉండకూడదట.

ఇవి మాత్రమే కాదు మరిన్ని లక్షణాలు కూడా ఉంటాయి. కానీ వారి మనసు, వాతావరణం వంటి వాటిని దృష్టిలో పెట్టుకొని ఆలోచిస్తారు. సో మంచి వ్యక్తిగా ఉండటం బెటర్. ఇలాంటి వారిని ఎవరు అయినా ఇష్టపడతారు. సో ఆల్ ది బెస్ట్.