PM Modi: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో దాదాపు 200లకుపైగా సభల్లో పాల్గొన్న ప్రధాని నరేంద్రమోదీ.. చివరి విడత ఎన్నికల ప్రచారం ముగియడంతో విశ్రాంతి తీసుకోవాలని నిర్ణించుకున్నారు. ఈమేరకు ఆయన తమిళనాడులోని కన్యాకుమారిలో వెలసిన స్వామి వివేకానంద శిలాస్మారకం వద్ద గురువారం సాయంత్రం నుంచి సుదీర్ఘ ధ్యానంలో కూర్చున్నారు. 45 గంటలపాటు ఆయన మెడిటేషన్ చేయనున్నారు.
ప్రారంభమైన ధ్యానం..
గురువారం(మే 30వ) సాయం‘తం 6:45 గంటల సమయంలో మోదీ ధాన్యం ప్రారంభించారు. ఈ సమయంలో ఆయన కేవలం ద్రవ పదార్థాలు మాత్రమే ఆహారంగా స్వీకరిస్తారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కొబ్బరి నీళ్లు, ద్రాక్షరసం అందులో భాగంగా ఉంటాయని పేర్కొన్నారు. ఈ సమయంలో ఆయన మౌనంగా ఉంటారని, మెడిటేషన్ హాల్ నుంచి బయటకు రారని తెలిపారు.
పంజాబ్ నుంచి నేరుగా తమిళనాడుకు..
గురువారం సాయంత్రం ఎన్నికల ప్రచారం ముగిసింది. ఈ సమయంలో పంజాబ్‌లో తుది విడత ఎన్నికల సభ నిర్వహించిన ప్రధాని మోదీ.. ప్రచారం అనంతరం నేరుగా తమిళనాడుకు చేరుకున్నారు. భగవతి అమ్మన్ ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం ఓ పడవలో సముద్రం మధ్యలో ఉన్న శిలాస్మారకానికి చేరుకున్నారు. రామకృష్ణ పరమహంస, మాతా శారాదేవి చిత్రపాలకు పూలమాలలు వేశారు. వివేకానందుడి విగ్రహం వద్ద పుష్పాంజలి ఘటించారు. తర్వాత ధాన్యం ప్రారంభించారు. ఈ క్రమంలో ఆయన కాషాయ దుస్తులు ధరించి ధాన్యంలో కూర్చుని ఉన్న కొన్ని దృశ్యాలు బయటకు వచ్చాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
131 ఏళ్ల క్రితం వివేకానంద కూడా..
ఇదిలా ఉంటే.. 131 ఏళ్ల క్రితం స్వామి వివేకానంద కూఏడా ఇక్కడ ధాన్యం చేశారు. 1892లో స్వామి వివేకానందుడు ఇక్కడే మూడు పగళ్లు, మూడు రాత్రులు ధాన్యం చేసి జానం సంపాదించారని భక్తులు నమ్ముతారు. వివేకానందుడిని ఆదర్శంగా భావించే మోదీ యువకుడిగా ఉన్న రోజుల్లో రామకృష్ణ మిషన్ సభ్యుడిగా చేరారు. వివేకానందుడు స్థాపించిన ఈ సంస్థ 125వ వార్షికోత్సవం గతేడాది జరిగింది. ఈ వేడుకల్లోనూ మోదీ పాల్గొన్నారు. తాజాగా వివేకానందుడు ధాన్యం చేసిన ప్రదేశంలోనేధాన్యం చేయాలని నిర్ణయించారు. 2019 లోక్‌సభ ఎన్నికలు ముగిసిన తర్వాత మోదీ కేదార్‌నాథ్ వద్ద గుహల్లో ధాన్యం చేశారు. ఇప్పుడు కన్యాకుమారిలో చేస్తున్నారు.
32 ఏళ్ల నాటి ఫొటో వైరల్…
మోదీ 45 గంటల ధాన్యం ప్రారంభించిన నేపథ్యంలో 32 ఏâ¶క్రకితం ఈ ప్రఖ్యాత స్థంల వద్ద ఆయన పర్యటించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 1991, డిసెంబర్ 11న బీజేపీ ఏక్తాయాత్రను ప్రారంభించింది. అప్పుడు బీజేపీ నేతలు వివేకానందుడి విగ్రహం వద్ద నివాళులర్పించారు. ఈ యాత్రకు నాయకత్వం వహించిన మురళీమనోహర్‌జోషితోపాటు నరేంద్రమోదీ కూడా ఈ ఫొటోలో ఉన్నారు. నాటి యాత్ర 14 రాష్ట్రాల మీదుగా సాగింది. 1992, జనవరి 26న శ్రీనగర్‌లో ముగిసింది.