https://oktelugu.com/

Digits in phone number : ఫోన్‌ నంబర్‌‌లో పది అంకెలే ఎందుకు ఉండాలి? దీనికి కారణం ఏంటి?

ఇప్పుడున్న టెక్నాలజీలో అందరూ కూడా స్మార్ట్ ఫోన్‌లు వాడుతున్నారు. అయితే స్నేహితులు, కుటుంబ సభ్యులు, బంధువులకు కాల్ చేయాలంటే తప్పకుండా పది అంకెల నంబర్ ఎంటర్ చేయాలి. అప్పుడే కాల్ వెళ్తుంది. మరి ఈ ఫోన్‌ నెంబర్‌లో పది అంకెలు ఎందుకు ఉన్నాయి. దీనికి కారణం ఏంటో మరి చూద్దాం.

Written By:
  • Bhaskar
  • , Updated On : September 20, 2024 / 06:38 AM IST

    Digits in phone number

    Follow us on

    Digits in phone number : ప్రస్తుతం కాలంలో ప్రతి ఒక్కరూ మొబైల్ వాడుతున్నారు. అందరికీ సిమ్ ఉంటుంది. కొంతమంది అయితే రెండు నుంచి మూడు సిమ్‌లు కూడా వాడుతున్నారు. అయితే మొబైల్ నంబర్‌కి కేవలం పది అంకెలు మాత్రమే ఉంటాయి. అసలు పది అంకెలే ఎందుకు ఉన్నాయి. పది కంటే ఎక్కువ ఉండవచ్చు. తక్కువగా కూడా ఉండవచ్చు. కానీ పది అంకెలే ఎందుకు ఉండాలనే డౌట్ మీకు ఎప్పుడైనా వచ్చిందా. నాకు తెలిసి చాలామందికి ఈ సందేహం వచ్చే ఉంటుంది. మన ఇండియాలో మాత్రమే ఫోన్‌ నంబర్ పది అంకెలు ఉంటాయి. అదే వేరే దేశాల్లో చూస్తే తక్కువగా లేదా ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడున్న టెక్నాలజీలో అందరూ కూడా స్మార్ట్ ఫోన్‌లు వాడుతున్నారు. అయితే స్నేహితులు, కుటుంబ సభ్యులు, బంధువులకు కాల్ చేయాలంటే తప్పకుండా పది అంకెల నంబర్ ఎంటర్ చేయాలి. అప్పుడే కాల్ వెళ్తుంది. మరి ఈ ఫోన్‌ నెంబర్‌లో పది అంకెలు ఎందుకు ఉన్నాయి. దీనికి కారణం ఏంటో మరి చూద్దాం.

    భారత జనాభా ప్రస్తుతం 130 కోట్లు ఉందని అంచనా. అయితే జనాభా అనేది అలా పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి మన దేశ జనాభాను దృష్టిలో ఉంచుకుని భారత టెలికాం సంస్థ ఫోన్‌ నంబర్‌కు పది అంకెలు పెట్టాలని నిర్ణయం తీసుకుంది. జాతీయ నెంబరింగ్ పథకం ప్రకారం 0 నుంచి 9 అంకెల్లో ఒక డిజిట్‌తో ఫోన్ నంబర్ ఉంటే 10 నంబర్లు మాత్రమే కేవలం తయారు చేస్తారు. వీటిని కేవలం 10 మంది మాత్రమే వాడుతారు. అయితే 0 నుంచి 99 అంకెల్లో ఉన్న వాటితో రెండు డిజిట్‌లతో ఫోన్ నంబర్ అనేది తయారు చేస్తే 100 రకాల నంబర్లు అవుతాయి. వీటిని 100 మంది వాడవచ్చు. ఇలా మన దేశ జనాభాను ముందుగానే దృష్టిలో ఉంచుకుని పది అంకెల నంబర్‌ను పెట్టారు. అదే 9 అంకెల నంబర్‌ను పెడితే భవిష్యత్తులో మన దేశ ప్రజలందరికీ మొబైల్ నంబర్ కేటాయించడం అనేది కష్టం అవుతుంది. కాబట్టి 10 అంకెల నంబర్‌ను పెట్టారు. ఈ పది అంకెల నంబర్‌తో దాదాపుగా 1000 కోట్ల కొత్త నంబర్లను తయారు చేయవచ్చు. భవిష్యత్తులో భారత జనాభా 1000 కోట్లు పెరిగిన మొబైల్‌ నంబర్ల కొరత ఉండదు. జనాభా పెరుగుతుండటం వల్ల దాని డిమాండ్ బట్టి ముందుగానే ఇలా పది అంకెల నంబర్‌ను పెట్టారు.

    మొదటి నుంచి భారతదేశంలో 10 అంకెల నంబర్ ఉందా అంటే లేదు. గతంలో అంటే 2003కి ముందు 9 అంకెల నంబర్లు మాత్రమే దేశంలో ఉండేవి. కానీ జనాభా రోజురోజుకీ పెరుగుతుండటంతో టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా మొబైల్ నంబర్‌ను పది అంకెలకు మార్చింది. ఇక అప్పటి నుంచి దేశంలో పది అంకెల మొబైల్ నంబర్‌నే వాడుతున్నారు. భారత జనాభా ఒకవేళ వెయ్యి కోట్ల కంటే ఎక్కువగా అయితే అప్పుడు మళ్లీ మొబైల్ నంబర్‌లోని అంకెల సంఖ్యను మార్చే అవకాశం ఉంది.