https://oktelugu.com/

WhatsApp: జనవరి 1, 2025 నుంచి ఈ ఆండ్రాయిడ్ ఫోన్లో వాట్సాప్ పనిచేయదు… ఈ జాబితాలో మీ ఫోన్ కూడా ఉందేమో చూసుకోండి..

పాత డివైస్లలో సెక్యూరిటీ ఫీచర్స్ సరిగ్గా లేకపోవడం అవి సైబర్ దాడులకు గురయ్యే అవకాశం ఉండడంతో అటువంటి వాటికి వాట్సాప్ సపోర్ట్ నిలిపివేసింది.

Written By:
  • Mahi
  • , Updated On : January 3, 2025 / 08:35 AM IST

    WhatsApp(1)

    Follow us on

    WhatsApp: పాత డివైజ్లలో కొత్త ఫీచర్లు కొన్ని సజావుగా పనిచేయవు. అటువంటి డివైజ్లలో వాట్సాప్ నిలిచిపోనుంది. పాత డివైస్లలో సెక్యూరిటీ ఫీచర్స్ సరిగ్గా లేకపోవడం అవి సైబర్ దాడులకు గురయ్యే అవకాశం ఉండడంతో అటువంటి వాటికి వాట్సాప్ సపోర్ట్ నిలిపివేసింది. ఈ మధ్యకాలంలో ఎవరి చేతిలో చూసిన స్మార్ట్ ఫోన్ తప్పనిసరిగా ఉంటుంది. అలాగే ఆ స్మార్ట్ ఫోన్లో ఉండే కొన్ని యాప్స్ లో వాట్సాప్ కూడా తప్పనిసరిగా ఉంటుందని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్ ను ఉపయోగించి చాటింగ్ లేదా వీడియో కాల్స్ చేసుకుంటూ ఉంటారు. వాట్సాప్ అత్యంత ప్రజాదారణ పొందిన మెసేజింగ్ సర్వీస్ యాప్. అయితే తాజాగా కొన్ని ఆండ్రాయిడ్ ఫోన్లలో వాట్సాప్ మెసేజింగ్ సర్వీస్ నిలిచిపోనుంది. తాజాగా వాట్సాప్ తన ప్లాట్ ఫామ్ సర్వీస్ రిక్వైర్మెంట్ను అప్డేట్ చేసింది. దీని కారణంగా జనవరి 1, 2025 నుంచి కొన్ని ఆండ్రాయిడ్ డివైస్లలో వాట్సాప్ పనిచేయడం నిలిచిపోయింది. ఇలా నిలిచిపోయిన వాటిలో ఆండ్రాయిడ్ 4.0 లేదా కిట్ క్యాట్ వంటి ఆపరేటింగ్ సిస్టంలపై పనిచేసే టాబ్లెట్లు మరియు ఫోన్లు ఉన్నాయని తెలుస్తుంది.

    జనవరి 1, 2025 నుంచి ఈ ఆండ్రాయిడ్ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు.
    సామ్సంగ్ గెలాక్సీ s3
    మోటోరోలా మోటో జి
    హెచ్ టి సి వన్ ఎక్స్
    సోనీ ఎక్స్పీరియా జెడ్
    సాంసంగ్ గెలాక్సీ నోట్ 2
    సామ్సంగ్ గెలాక్సీ s4 మినీ
    మోటోరోలా మోటో జి ఒకటవతరం
    మోటోరోలా రేసర్ హెచ్ డి
    మోటో ఈ 2014
    హెచ్ టి సి డిజైర్ 500
    హెచ్ టిసి డి 601
    ఎల్జీ ఆప్టిమస్ జి
    ఎల్ జి నెక్సస్ 4
    ఎల్జి జి2 మినీ
    ఎల్జి ఎల్ 90
    సోనీ ఎక్స్పీరియా జెడ్
    సోనీ ఎక్స్పీరియా ఎస్పి
    సోనీ ఎక్స్పీరియా

    ఇప్పుడు మీరు ఏం చేయవచ్చో తెలుసుకోండి…
    ప్రస్తుతం మీరు ఉపయోగిస్తున్న ఫోన్ పైన ఉన్న జాబితాలో ఉంటే లేదా ఈ పాత ఆండ్రాయిడ్ సిస్టం లలో ఒకదానితో అది రన్ అవుతున్నట్లయితే మీకు ఈ రెండు ఆప్షన్స్ ఉన్నాయి. అవి ఏంటంటే..
    1. మీరు ఉపయోగిస్తున్న ఫోన్ లో లేటెస్ట్ సాఫ్ట్ వేర్ అప్డేట్ ఏదైనా అందుబాటులో ఉందేమో చూసుకోండి. వాట్సాప్ రన్ అయ్యే కొత్త వర్షన్ కు మీ ఫోన్ ను అప్డేట్ చేసుకోండి.
    2. ప్రస్తుతం మీరు ఉపయోగిస్తున్న ఫోన్ లేదా టాబ్లెట్ను మార్చండి. కొత్త స్మార్ట్ ఫోన్ లేదా టాబ్లెట్ను తీసుకోండి.

    పాత డివైస్లలో వాట్సాప్ ఎందుకు పనిచేయదో తెలుసా…
    పైన పేర్కొన్న జాబితాలో ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్లలో వాట్సాప్ పని చేయదు. దీనికి కారణం పాత డివైస్లు వాట్సాప్ కొత్త ఫీచర్లను సజావుగా సపోర్ట్ చేయలేవు. అధికారికంగా వాట్సాప్ కంపెనీ పాత పరికరాలకు ఈ సేవలను నిలిపివేసింది. పాత డివైస్ లకు రెగ్యులర్ సెక్యూరిటీ ప్యాచ్ లు కూడా లభించకపోవచ్చు. ఈ కారణంగా ఆ పాత పరికరాలు మాల్వేర్ లేదా వైరస్ల బారిన పడే అవకాశం ఉంటుంది.