https://oktelugu.com/

WhatsApp Web : వాట్సాప్ వెబ్ ను వాడుతున్నారా?

WhatsApp Web : ముఖ్యంగా వాట్సాప్ ను ఉపయోగించేవారు తమ చాటును ఇతరులు పరిశీలిస్తున్నారా? అనేది తెలుసుకుంటూ ఉండాలి. ఇందుకోసం వాట్సాప్ లోనే ఒక చిన్న ఆప్షన్ ద్వారా తెలుసుకోవచ్చు. అది ఎలాగో అంటే?

Written By: , Updated On : March 24, 2025 / 05:00 AM IST
WhatsApp Web

WhatsApp Web

Follow us on

WhatsApp Web : ప్రస్తుత రోజుల్లో ప్రతి మొబైల్ లో వాట్సాప్ యాప్ తప్పనిసరిగా ఉంటుంది. అయితే వినియోగదారులకు అనుగుణంగా ఉండేందుకు ఈ యాప్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ వస్తుంది. ముఖ్యంగా వినియోగదారుల ప్రైవసీకి సంబంధించి అనేక సదుపాయాలను తీసుకొచ్చింది. అయినా కొందరు సైబర్ నేరగాళ్లు వాట్సాప్ ను హ్యాక్ చేసి వారి ప్రైవసీని దెబ్బతీస్తున్నారు. ఈ నేపథ్యంలో వినియోగదారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా వాట్సాప్ ను ఉపయోగించేవారు తమ చాటును ఇతరులు పరిశీలిస్తున్నారా? అనేది తెలుసుకుంటూ ఉండాలి. ఇందుకోసం వాట్సాప్ లోనే ఒక చిన్న ఆప్షన్ ద్వారా తెలుసుకోవచ్చు. అది ఎలాగో అంటే?

Also Read : వాట్సాప్‌లో కొత్త ఫీచర్…ఇకపై ఫోటో, ఆడియో మెసేజ్‌లకు కూడా రిప్లై వస్తుంది

టెక్స్ట్ మెసేజ్ నుంచి వీడియోస్ వరకు వాట్స్అప్ ద్వారానే ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటాయి. మనీ ట్రాన్సాక్షన్ కూడా అందుబాటులోకి రావడంతో చాలామంది వాట్సాప్ ని ఫాలో అవుతూ ఉన్నారు. అయితే వాట్సాప్ ద్వారా వినియోగదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించిన యాజమాన్యం ఎప్పటికప్పుడు దీనిని అప్డేట్ చేస్తూ వస్తుంది. ముఖ్యంగా వినియోగదారుల ప్రైవసీని దెబ్బతీసేలా ఎటువంటి రిమార్కు వచ్చిన వెంటనే దానిని పరిష్కరిస్తుంది. వినియోగదారులు తమ చాటును ఇతరులు చూడకుండా ఉండడానికి ఎండ్ టు ఎండ్ అనే ఆప్షన్ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇది ఎనేబుల్ చేసుకున్న వారి చాట్ హిస్టరీని మూడో వ్యక్తి చూడలేరు.

అయితే మరో రకంగా కూడా వాట్సాప్ వినియోగదారులను కొందరు సైబర్ నేరగాలు చీట్ చేస్తున్నారు. వారికి తెలియకుండానే లాగిన్ అయి వాట్సాప్ ను మొత్తం హ్యాక్ చేసే విధంగా ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం వాట్సాప్ వెబ్ను ఉపయోగించేవారు ఎప్పటికప్పుడు ఎవరెవరు లాగిన్ అయి ఉన్నారో తెలుసుకోవాలి. సెట్టింగ్స్లోకి వెళ్లి లింక్డ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఇప్పుడు వాట్సాప్ కు ఎన్ని డివైస్లు లాగిన్ అయి ఉన్నాయో తెలుసుకోవచ్చు. వీటిలో మీ డివైస్ కాకుండా ఇతర ఏ డివైస్ ఉన్న వెంటనే వాటిని లాగౌట్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక్కోసారి ఇతర ప్రదేశాల్లోకి వెళ్ళినప్పుడు మీ వాట్సాప్ ద్వారా వేరే డివైస్ ని కరెక్ట్ చేసి ఉంటారు. కానీ దానిని లాగౌట్ చేయకపోతే అది అలాగే కొనసాగే అవకాశం ఉంది. అంతేకాకుండా కొందరు మొబైల్ నెంబర్ ద్వారా పరోక్షంగా లాగిన్ అయ్యే అవకాశం ఉంటుంది.

అందువల్ల లింక్డ్ ఆప్షన్ ను ఎప్పటికప్పుడు క్లిక్ చేస్తూ ఎవరెవరు డివైస్ కు కనెక్ట్ అయి ఉన్నారో తెలుసుకోవాలి. లేకుంటే పర్సనల్ విషయాలు ఇతరుల కు వెళ్తాయి. ఆ తర్వాత చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వాట్సాప్ ఉపయోగించేవారు అనవసరపు కాంటాక్ట్లను వెంటనే తొలగించుకోవాలి. లేదా గుర్తింపు లేని అనుకోకుండా కొన్ని గ్రూపులు క్రియేట్ అయితే వాటి అవసరం లేకుంటే వెంటనే వాటి నుంచి బయటపడాలి. ముఖ్యంగా మనీ ట్రాన్సాక్షన్ కు సంబంధించిన గ్రూపులో క్రియేట్ అయితే వాటి నుంచి ఎంత తొందరగా బయటపడితే అంత మంచిది. వీటి ద్వారా కూడా సైబర్ నేరగాళ్లు మోసం చేసే అవకాశం ఉందని కొందరు సాంకేతిక నిపుణులు తెలుపుతున్నారు.

Also Read : మీరు వాట్సాప్ వాడుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త.. ఇలాంటి కాల్స్ వస్తే ఏం చేయాలంటే?