Google Messages app Features
Google messages : ప్రస్తుతం మనకు ఏ విషయం గురించి తెలియాలన్నా.. మరింత లోతుగా తెలుసుకోవాలనుకున్నా.. ముందుగా మన మదిలో మెదిలేది గూగుల్ మాత్రమే. క్రోమ్(Google Chrome), మ్యాప్స్(Google maps), జీ మెయిల్(Gmail), జెమిని (Google Gemini), గూగుల్ సర్చ్ (Google search) ఇంకా అనేకమైన సాంకేతిక సౌకర్యాలను గూగుల్ తన యూజర్లకు అందిస్తోంది. అందువల్లే టెక్నాలజీలో గూగుల్ మిగతా అన్నిటికంటే మిన్నగా ఉంటున్నది. రోజురోజుకు మరింత సాంకేతిక అనుభూతిని యూజర్లకు అందించడానికి సరికొత్త అప్డేట్స్ అందిస్తోంది. అయితే యూజర్లకు ఇప్పుడు గూగుల్ మరో బంపర్ ఆఫర్ ఇచ్చింది.. మరి కొద్ది రోజుల్లో ఇది అందుబాటులోకి రానుంది. ఇది కనుక అందుబాటులోకి వస్తే యూజర్లకు ఇక పండగే పండగ.
మెసేజెస్ యాప్ నుంచే..
సాధారణంగా ఫేస్బుక్ మెసెంజర్, వాట్సప్, ఇతర మైక్రో మెసెంజర్ యాప్స్ వాడే వాళ్లు కాల్స్ చేయడం సులభం. ఆ యాప్ వాడితే చాలు ఈజీగానే కాల్స్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు వాట్సప్ వాడే వారికి సరికొత్త సౌలభ్యాన్ని గూగుల్ తీసుకొచ్చింది.. Google మెసేజెస్ యాప్ నుంచి నేరుగా వాట్స్అప్ వీడియో కాల్(WhatsApp video call) చేసుకునే ఫీచర్ అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం ఈ ఆప్ ద్వారా గూగుల్ మీట్(Google meet) వీడియో కాల్స్ చేసుకునే అవకాశం మాత్రమే ఉంది. ఆ యాప్స్ ను స్విచ్ చేసుకునే బదులు.. యూజర్లకు మరింత సౌకర్యవంతంగా ఉండే విధంగా ఈ ఫీచర్ తీసుకొచ్చినట్టు గూగుల్ చెబుతోంది.. ముందు వన్ ఆన్ వన్ కాల్స్ కు మాత్రమే ఇది సపోర్ట్ చేస్తుంది. ఫోన్ లో కనుక వాట్స్అప్ ఇన్ స్టాల్ అయి ఉంటేనే ఈ ఫీచర్ పనిచేస్తుందని గూగుల్ చెబుతోంది. “అద్భుతమైన సాంకేతిక అనుభూతిని అందించేందుకే ఈ ఫీచర్ యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చాం. టెస్టింగ్ దశ పూర్తయిపోయింది. చిన్న చిన్న మార్పులు కూడా జరిగిపోయాయి. త్వరలోనే ఇది యూజర్లకు అందుబాటులోకి వస్తుంది. తద్వారా వీడియో కాల్ లో సరికొత్త అనుభూతి కలుగుతుంది. గూగుల్ మీట్ వన్ ఆన్ వన్ కాల్స్ కు మాత్రమే ఇది సపోర్ట్ చేస్తుంది. ఆ తర్వాత అపరిమితంగా మాట్లాడుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. ప్రస్తుత సాంకేతిక రంగంలో ప్రతి విషయం కూడా ముఖ్యంగా మారిపోయింది. కొత్త కొత్త అప్డేట్స్ అనేవి యూజర్లకు అవసరంగా ఉన్నాయి.. అలాంటప్పుడు మెరుగైన సాంకేతిక అనుభూతిని ఇవ్వడం చాలా అవసరం. అందువల్లే ఇలాంటి ప్రయోగాలు చేస్తున్నాం. ప్రస్తుతం యూజర్లకు కావలసింది కూడా అవేనని” google వర్గాలు చెబుతున్నాయి.