Chiranjeevi
Chiranjeevi : ఇటీవల ‘బ్రహ్మ ఆనందం'(Bramha Aanandham) మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి(megastar chiranjeevi), ఆ ఈవెంట్ లో ఆయన సరదాగా మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు నేషనల్ వైడ్ గా ఎంతటి వివాదాలకు దారి తీశాయో మన అందరికీ తెలిసిందే. నా లెజసీ ముందుకు వెళ్లాలంటే వారసుడు కావాలి, మళ్ళీ మా అబ్బాయి ఎక్కడ అమ్మాయిని కంటాడేమో అని భయంగా ఉందంటూ చిరంజీవి చేసిన కామెంట్స్ దుమారం రేపాయి. అదే విధంగా ఆయన తాతగారు పెద్ద రసికుడు అంటూ చేసిన కామెంట్స్ పై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ ఈవెంట్ లో ప్రముఖ క్యారక్టర్ ఆర్టిస్ట్ రఘుబాబు(Raghu Babu) మాట్లాడిన కొన్ని మాటలు మెగాస్టార్ చిరంజీవి గొప్పతనాన్ని తెలియచేసేలా ఉన్నాయి. అభిమానులు ఈ వీడియో ని షేర్ చేస్తూ సోషల్ మీడియా లో ట్రెండ్ చేస్తున్నారు.
ఆయన మాట్లాడుతూ ‘నా కెరీర్ లో బన్నీ చిత్రం ఒక మైలు రాయి లాంటిది. అంతకు ముందు చాలా సినిమాలు చేసినప్పటికీ, ఈ చిత్రం ద్వారానే నాకంటూ ఒక ఇమేజ్ ఏర్పడింది. ఒకరోజు ఈ మూవీ సక్సెస్ మీట్ ని ఏర్పాటు చేస్తే పాల్గొన్నాను. ప్రతీ ఆర్టిస్టు నా గురించి తప్ప, అందరి గురించి మాట్లాడారు. దీనికి నేను కొంత అసహనానికి గురయ్యాను. వీవీ వినాయక్ కూడా ఏంటయ్యా నువ్వు అంత మంచి పాత్ర పోషిస్తే నీ గురించి ఒక్కరు కూడా మాట్లాడలేదని బాధపడ్డాడు. అలా భాదపడుతున్న సమయంలో ఆ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి రఘు బాబు గురించి మాట్లాడాడు. నేను బన్నీ సినిమాని రిపీట్ లో చూశానంటే అందుకు కారణం రఘు బాబు అని చెప్పాడు. ఆరోజు నన్ను అంతలా ఆయన గుర్తించుకొని మాట్లాడడం నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆ మాట అన్న తర్వాత నాకు వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి. 400 కి పైగా చిత్రాల్లో నటించాను’ అంటూ చెప్పుకొచ్చాడు.
రఘుబాబు ప్రముఖ సీనియర్ మోస్ట్ క్యారక్టర్ ఆర్టిస్టు గిరి బాబు కుమారుడు. గతంలో ఆయన ఎన్టీఆర్, ఏఎన్నార్, చిరంజీవి, కృష్ణ, శోభన్ బాబు, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు ఇలా ఎంతో మంది హీరోల సినిమాల్లో కీలక పాత్రలు పోషించి మంచి గుర్తింపుని తెచ్చుకున్నాడు. ఇప్పటికీ ఈయన పలు సినిమాల్లో నటిస్తూనే ఉన్నాడు. ఇక రఘు బాబు విషయానికి వస్తే ఈయన కెరీర్ విలన్ రోల్స్ తో మొదలైంది. కానీ బన్నీ చిత్రం లో మొట్టమొదటిసారి కామెడీ రోల్ చేసాడు. అక్కడి నుండి అత్యధిక శాతం రఘు బాబు కి కామెడీ రోల్స్ మాత్రమే ఎక్కువగా వస్తుండేవి. ఇప్పటికీ కూడా రఘు బాబు కి అలాంటి పాత్రలే దక్కుతున్నాయి. పాన్ ఇండియన్ చిత్రాలతో పాటు, మధ్యలో ‘బ్రహ్మ ఆనందం’ లాంటి మీడియం రేంజ్ బడ్జెట్ సినిమాల్లో కూడా నటిస్తూ ఫుల్ బిజీ గా ఉన్నాడు.