WhatsApp New Feature: దాదాపుగా ప్రతీ ఒక్కరి స్మార్ట్ ఫోన్స్‌లో ఇన్ స్టాల్ అయి ఉన్న యాప్ ‘వాట్సాప్’ అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ప్రతీ ఒక్కరు చాలా కంఫర్టబుల్ గా వాట్సాప్ ను యూజ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే వాట్సాప్ సంస్థ తన కస్టమర్స్ కోసం సరికొత్త ఫీచర్స్ తీసుకొచ్చేందుకుగాను ప్రయత్నిస్తున్నది. పేమెంట్స్ సర్వీసును కూడా ఈ నేపథ్యంలోనే వాట్సాప్ స్టార్ట్ చేసింది. తాజాగా ఇందులో మరో ఫీచర్ తీసుకొచ్చింది. అదేంటంటే..
వాట్సాప్ సంస్థ గతేడాది చాట్ బార్‌లో యూజర్స్ ఫెసిలిటీస్ కోసం పేమెంట్స్ బటన్ పొందు పరిచింది. తద్వారా డబ్బు డైరెక్ట్‌గా పంపించుకోవచ్చు. తాజాగా పేమెంట్స్ కోసం మరో ఫీచర్ తీసుకొచ్చింది. అదే క్యూఆర్ కోడ్ స్కానింగ్ ఫీచర్.. ఈ ఫీచర్ ఉపయోగించి ఏదేని స్టోర్, షాప్ లేదా ఇంకెక్కడైనా క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసి మనీ పేమెంట్ చేసుకోవచ్చు. యూపీఐ ఐడీ ద్వారా కాని ఫోన్ నెంబర్ ద్వారా కాని కూడా పేమెంట్స్ చేసుకోవచ్చు. పేమెంట్ యాప్స్ గూగుల్ పే, ఫోన్ పే, అమెజాన్ పే లాంటి వాటిల్లో ఈ స్కానింగ్ క్యూఆర్ కోడ్ ఫీచర్ అవెయిలబుల్‌లో ఉంది. కాగా, తాజాగా వాట్సాప్ కూడా ఆ ఫీచర్ ను తీసుకొచ్చింది.
Also Read: గత జన్మ తల్లిదండ్రులను అడిగిన చిన్నారి.. ఆశ్చర్యం
ఇండియన్ యూజర్స్ కోసం ఈ ఫీచర్ తీసుకొచ్చినట్లు వాట్సాప్ సంస్థ చెప్పింది. ఇకపోతే ఈ వాట్సాప్ క్యూఆర్ కోడ్ పేమెంట్స్ యూసేజ్ కూడా వెరీ సింపుల్. క్యూఆర్ స్కోర్ స్కాన్ ఆప్షన్ ఎంచుకుంటే చాలు.. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్స్ అందరికీ ఈ ఫీచర్ అవెయిలబులిటీలోకి తీసుకొచ్చింది వాట్సాప్. అయితే, మీ యూపీఐ ఐడీని పేమెంట్స్ కోసం లింక్ చేసి ఉంటేనే ఈ ఫీచర్ పని చేస్తుంది. బ్యాంకు అకౌంట్‌ను వాట్సాప్ పేమెంట్స్ కు లింక్ చేసి, ఆ తర్వాత ఈ ఫీచర్ ను ఉపయోగించాలి.
ఈ ప్రాసెస్ సింపుల్ గానే ఉంటుంది. స్మార్ట్ ఫోన్ లో వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత.. కెమెరా ఐకాన్‌పైన కాని మెనూలోని పేమెంట్ సెక్షన్ కాని పేమెంట్ క్యూఆర్ కోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. దానిని క్లిక్ చేస్తే చాలు.. మీ ఫోన్ బ్యాక్ కెమెరా స్కానర్‌గా మారిపోతుంది. సదరు షాప్.. మీరు ఎక్కడైతే ఉంటారో అక్కడి.. ప్లేస్‌లో ని క్యూఆర్ కోడ్ ను ఆటోమేటిక్ గా స్కాన్ చేసేస్తుంది. అలా మీరు క్యూఆర్ కోడ్ ఫీచర్ తో పేమెంట్ చేసేయొచ్చు.
Also Read: చీకటి పడ్డాక ఈ వస్తువులు, పదార్థాలను ఇవ్వొద్దు.. ఎందుకో తెలుసా?
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.
Read MoreWeb Title: Whatsapp starts qr code payments in india
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com