Gmail: జీ మెయిల్ రొటీన్ గా వాడితే ఏం బాగుంటుంది.. ఇలా మార్చి చూడండి..

జీ మెయిల్ అన్ని ఈ మెయిల్ లకు సంబంధించిన నోటిఫికేషన్లు చూపిస్తూ ఉంటుంది. అయితే ఇది చాలామందికి ఇబ్బంది కలిగిస్తుంది. ముఖ్యమైన పనుల్లో ఉన్నప్పుడు అలాంటి నోటిఫికేషన్లు చిరాకు కలిగిస్తాయి.

Written By: Anabothula Bhaskar, Updated On : June 8, 2024 8:04 am

Gmail

Follow us on

Gmail: అవసరం ఆధారంగానే ఆవిష్కరణలు పుడతాయి. అవసరాలు పెరిగినా కొద్దీ అందులో కొత్త కొత్త ఫీచర్లు అందుబాటులోకి వస్తున్నాయి. అవి మరింత కొత్త సాంకేతికతను పరిచయం చేస్తున్నాయి. అలాంటి సాంకేతికత మనిషి జీవితాన్ని మరింత సులభతరం చేస్తోంది.

ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్ లేకుండా మనిషి జీవితం సాఫీగా సాగే పరిస్థితి లేదు. పైగా ప్రతిదానికి జీ మెయిల్ తో అనుసంధానం అయిపోవడం సర్వసాధారణంగా మారింది. అయితే మనలో చాలామంది జీ మెయిల్ ను మెయిల్ పంపియడం.. లేకుంటే వచ్చిన మెయిల్ చూసుకోవడం.. ఫోటోలు లేదా ఇతర డాక్యుమెంట్లు పంపించడం లేదా స్వీకరించడం వంటి వాటికోసం మాత్రమే వాడుతుంటారు.. కానీ జిమెయిల్ అనేక అద్భుతాల పుట్ట. సెట్టింగ్స్ మార్చుకొని అనుకూలంగా మలచుకుంటే చాలు దానికి మించింది లేదు..

జీ మెయిల్ అన్ని ఈ మెయిల్ లకు సంబంధించిన నోటిఫికేషన్లు చూపిస్తూ ఉంటుంది. అయితే ఇది చాలామందికి ఇబ్బంది కలిగిస్తుంది. ముఖ్యమైన పనుల్లో ఉన్నప్పుడు అలాంటి నోటిఫికేషన్లు చిరాకు కలిగిస్తాయి. స్పామ్, మార్కెటింగ్ సంస్థలకు సంబంధించిన మెయిల్స్ నోటిఫికేషన్ వస్తే ఎక్కడా లేని కోపం వస్తుంది. ఇలాంటప్పుడు కేవలం ప్రాధాన్యం ఉన్న మెయిల్స్ కు మాత్రమే నోటిఫికేషన్ వచ్చేలా చూసుకోవచ్చు. అసలే వద్దు అనుకుంటే మొత్తానికి ఆఫ్ చేసుకోవచ్చు. దీనికోసం జిమెయిల్ యాప్ ఓపెన్ చేసి.. పైన ఎడమ వైపున కనిపించే అడ్డం మూడు గీతల మీద టచ్ చేయాలి. ఆ తర్వాత డ్రాప్ డౌన్ మెనూలోకి వెళ్లాలి. అక్కడ సెట్టింగ్స్ పై క్లిక్ చేయాలి. జిమెయిల్ ఖాతా ఐడి మీద టచ్ చేస్తే నోటిఫికేషన్ ఐకాన్ కనిపిస్తుంది. దానిమీద క్లిక్ చేస్తే ఆల్, హై ప్రయారిటీ, నన్ అనే ఆప్షన్లు కనిపిస్తాయి. అందులో ఏది ప్రాధాన్యత అంశంగా ఉంటే దానిపై క్లిక్ చేయవచ్చు.

జీ మెయిల్ లో వచ్చే మెయిల్స్ ను అంశాలవారీగా డివైడ్ చేసుకోవచ్చు. ప్రైమరీ విభాగంలో పర్సనల్ మెయిల్స్.. ప్రమోషనల్ విభాగంలో ఆయా కంపెనీలకు సంబంధించిన మెయిల్స్ లాగా వర్గీకరించుకోవచ్చు. ఓచర్లు, బిల్లులు, స్టేట్మెంట్లు.. ఇటువంటి వాటికోసం అప్డేట్స్, ఫోరమ్స్ అనే విభాగాలు ఉంటాయి. జిమెయిల్ యాప్ లో సెట్టింగ్స్ ఓపెన్ చేసి.. ఐడి మీద క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఇన్ బాక్స్ లో డిఫాల్ట్ విభాగాన్ని ఎంచుకోవాలి. అనంతరం అందులో ఇన్ బాక్స్ కేటగిరి మీద క్లిక్ చేస్తే.. ప్రైమరీ, ప్రమోషన్స్, సోషల్, అప్డేట్స్, ఫోరమ్స్ అనే ఐకాన్స్ కనిపిస్తాయి. వీటిల్లో అవసరమైన వాటిల్లో టిక్ పెట్టుకుంటే సరిపోతుంది. వద్దు అనుకున్న వాటిని బాక్స్ లో నుంచి టిక్ చేసి తీసివేయాలి.

జీ మెయిల్ నుంచి మెయిల్ పంపిన ప్రతిసారి సంతకం చేయాల్సి ఉంటుంది. అలాంటి పనులేకుండా మొబైల్ సిగ్నేచర్ అనే ఫీచర్ యూజర్లకు ఉపయోగపడుతుంది. దీనిని ఒకసారి ఎనేబుల్ చేసుకుంటే మెయిల్ పంపిన ప్రతిసారి డిఫాల్ట్ గా సంతకం యాడ్ అవుతుంది. జిమెయిల్ యాప్ లో సెట్టింగ్స్లోకి వెళ్లి.. ఖాతా మీద క్లిక్ చేసి.. కిందికి స్క్రోల్ చేస్తే.. మొబైల్ సిగ్నేచర్ అనే ఫీచర్ కనిపిస్తుంది. దాని మీద టాప్ చేసి సంతకాన్ని టైప్ చేసి.. ఓకే అని క్లిక్ చేస్తే సరిపోతుంది.