https://oktelugu.com/

‘జగనన్న విద్యాకానుక’ వాయిదా.. కారణమిదే?

ఏపీ సీఎం జగన్ ఏది మొదలుపెట్టినా అది ఆదిలోనే హంసపాదు అవుతోంది. ఇప్పటికే తన తండ్రి వైఎస్ఆర్ పేరు మీద పేదలకు భూపంపిణీ, ఇళ్లస్థలాలు చేపట్టాడు. అది కోర్టుల్లో నలిగిపోయింది. అంతేకాకుండా చాలా మంది అనర్హులకు పట్టాలు దక్కాయని ఫిర్యాదులు వచ్చాయి. దీంతో దెబ్బకు దాన్ని రద్దు చేసి మళ్లీ రీఫ్రెష్ గా లిస్ట్ రెడీ చేస్తున్నారు. ఆ కార్యక్రమం వాయిదాల మీద వాయిదా పడింది. Also Read: బ్రేకింగ్: శిరోముండనం కేసులో నూతన్ నాయుడు అరెస్టు […]

Written By: , Updated On : September 5, 2020 / 09:25 AM IST
Jagan Vidyakanuna

Ap Cm Jaganmohanreddy vidyakanunka

Follow us on

Jagan Vidyakanuna
ఏపీ సీఎం జగన్ ఏది మొదలుపెట్టినా అది ఆదిలోనే హంసపాదు అవుతోంది. ఇప్పటికే తన తండ్రి వైఎస్ఆర్ పేరు మీద పేదలకు భూపంపిణీ, ఇళ్లస్థలాలు చేపట్టాడు. అది కోర్టుల్లో నలిగిపోయింది. అంతేకాకుండా చాలా మంది అనర్హులకు పట్టాలు దక్కాయని ఫిర్యాదులు వచ్చాయి. దీంతో దెబ్బకు దాన్ని రద్దు చేసి మళ్లీ రీఫ్రెష్ గా లిస్ట్ రెడీ చేస్తున్నారు. ఆ కార్యక్రమం వాయిదాల మీద వాయిదా పడింది.

Also Read: బ్రేకింగ్: శిరోముండనం కేసులో నూతన్ నాయుడు అరెస్టు

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన ‘జగనన్న విద్యాకానుక’ కార్యక్రమం కూడా వాయిదా పడింది. ఇంగ్లీష్ మీడియం చదువులను ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెట్టి ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలు మార్చాలని జగన్ ఆశించారు. అదీ కోర్టుల్లోనే ఉంది.  తాజాగా జగనన్న విద్యాకానుకను ప్రభుత్వం అక్టోబర్ 5కు వాయిదా వేసింది.

జగనన్న విద్యాకానుక కింద ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు 2020-21 విద్యాసంవత్సరంలో సమగ్రశిక్ష ఆధ్వర్యంలో ‘జగనన్న విద్యాకానుక’లో భాగంగా కిట్ల పంపిణీ చేస్తారు. విద్యార్థికి మూడు జతల యూనిఫాం, నోటు పుస్తకాలు, పాఠ్యపుస్తకాలు, బూట్లు, సాక్సులు, బెల్టు, బ్యాగులను కిట్ రూపంలో అందజేస్తారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థికి కావాల్సిన అన్నింటిని ఒక కిట్ రూపంలో విద్యార్థికి అందజేస్తారు. ప్రైవేటుకు పోటీగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడం.. వారికి సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వ ఉద్దేశం.

Also Read: హాంఫట్.. తెలంగాణలో ఏం జరుగుతోంది?

అయితే జగనన్న విద్యాకానుక వాయిదా పడడానికి కరోనానే కారణం. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన అన్ లాక్ 4.0లో కోవిడ్ మార్గదర్శకాల ప్రకారం సెప్టెంబర్ 30వరకు పాఠశాలలు మూసివేత నిబంధన ఉంది. ఈ నేపథ్యంలోనే వాయిదా వేసినట్టు ఏపీ విద్యాశాఖ తెలిపింది.

దీంతో ప్రస్తుతానికి తాత్కాలికంగా జగనన్న విద్యాకానుకను అక్టోబర్ 5న అమలు చేయాలని నిర్ణయించినట్టు పాఠశాల విద్యాశాఖ పేర్కొంది.