UK’s F-35 fighter jet: కేజీఎఫ్ -2 సినిమా చూశారా.. అందులో తాను అక్రమంగా తయారుచేసిన గోల్డ్ బిస్కెట్ ను సిబిఐ అధికారులు తీసుకెళ్తే రాఖీ కి విపరితమైన కోపం వస్తుంది. వెంటనే సిబిఐ అధికారులు ఉండే కార్యాలయానికి వెళ్తాడు. అక్కడ పెద్ద తుపాకీతో కాల్పులు జరుపుతాడు. ఆ తుపాకీ ద్వారా బీభత్సంగా కాల్పులు జరుపుతాడు. ఆ కాల్పుల తీవ్రతకు సీబీఐ కార్యాలయంలో ఉన్న వాహనాలు మొత్తం తగలబడి పోతాయి. దీనిని రాఖీ కి ఇచ్చుకుంటూ ఆ వ్యక్తి తుపాకులలో ఇది పెద్దమ్మ అని సంబోధిస్తాడు. అలాంటి పెద్దమ్మనే అమెరికా ఇతర దేశాలకు పరిచయం చేసింది. కాకపోతే అది తుపాకీ కాదు. యుద్ధ విమానం.. ఆ యుద్ధ విమానానికి సంబంధించిన కథ ఎలాంటిదంటే..
వివాదాలు పెరుగుతున్నాయి
ఆధునిక కాలంలో దేశాల మధ్య అంతకంతకూ వివాదాలు పెరిగిపోతున్నాయి. పెత్తనం కోసం.. విలువైన వనరుల కోసం.. పై చేయి సాధించడం కోసం అనేక దేశాలు యుద్ధాలకు పాల్పడుతున్నాయి. అయితే ఈ యుద్ధాల వల్ల ప్రపంచం అనేక రకాలుగా విపత్కర పరిస్థితులను చవి చూస్తున్నప్పటికీ ఆయా దేశాల తీరు మారడం లేదు. యుద్ధం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. యుద్ధం అంటే దాడులు చేసుకోవడమే. ఇక నేటి సాంకేతిక కాలంలో యుద్ధమంటే ఆయుధాలతోనే పని. శక్తివంతమైన ఫైటర్ జెట్లు, యుద్ధ విమానాలు విధ్వంసాన్ని కొనసాగిస్తున్నాయి. ఇటీవల కాలంలో రష్యా – ఉక్రెయిన్, ఇరాన్- ఇజ్రాయిల్ దేశాల మధ్య యుద్ధాలు జరిగినప్పుడు అత్యాధునిక యుద్ధ సామగ్రిని వినియోగించాయి. అత్యంత ఆధునిక ఫైట్ జెట్ లు ఉపయోగించాయి.
Also Read: పెరిగిన భూమి వేగం..కాలానికి ముందే పరుగెడుతుందా? మార్పులు సంభవిస్తాయా? మానవాళికి ఎఫెక్ట్ పడుతుందా?
సరికొత్త యుద్ధ విమానం
ప్రపంచ దేశాల మధ్య యుద్ధం తాలూకు పరిస్థితులు ఏర్పడుతున్న నేపథ్యంలో.. ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధాల సరఫరాదారు అమెరికా సరికొత్త యుద్ధ విమానాన్ని తయారుచేసింది.. లాక్ హీడ్ మార్టిన్ అనే అమెరికా కంపెనీ ఐదవ తరం యుద్ధ విమానాన్ని తయారుచేసింది.. . ఈ యుద్ధ విమానాలను ఇంగ్లాండ్ కొనుగోలు చేసింది. ఈ విమానం గంటకు 1,975 కిలోమీటర్ల బేగంతో ప్రయాణిస్తుంది..500 ఫీట్ల రన్ వే పై టేక్ ఆఫ్ అవుతుంది. దీనిని కార్బన్ ఫైబర్, టైటానియం, అల్యూమినియం మెటల్స్ ఉపయోగించి తయారు చేశారు. అందువల్ల దీనిని రాడార్లు గుర్తించలేవు. అందువల్ల ఇది శత్రుదేశాలు చేసే దాడుల బారిన పడదు. పైగా శత్రు దేశాలపై వేగంగా దాడి చేయగలరు. గడచిన నెల 14వ తేదీన కేరళ రాష్ట్రంలోని తిరునంతపురంలో ఇది ఎమర్జెన్సీగా ల్యాండ్ అయింది.
Also Read: స్మార్ట్ రింగ్.. డిజిటల్ డిస్ల్పే. ధర ఎంతంటే?
అత్యంత ఆధునికమైన పే లోడ్
ఈ యుద్ధ విమానంలో అత్యంత ఆధునికమైన పే లోడ్ రవాణా చేయవచ్చు. ఇది ఐదవ తరం యుద్ధ విమానం కాబట్టి దాడులు కూడా వెంట వెంటనే చేయగలదు. సుదూర లక్ష్యాలను కూడా సులువుగా చేదించగలదు. ముఖ్యంగా దీనిలో అత్యంత ఆధునికమైన రాడార్లు ఉంటాయి. అందువల్ల ఇది లక్ష్యంగా చేసుకున్న ప్రదేశాలపై అత్యంత వేగంగా దాడులు చేస్తుంది. పైగా టార్గెట్ ఏరియాలను చూస్తుండగానే సర్వనాశనం చేస్తుంది. ఒక రకంగా దీనిని విధ్వంసానికి పరాకాష్ట లాంటి యుద్ధ విమానం అనవచ్చు. అయితే ఇంగ్లాండ్ ఈ యుద్ధ విమానాన్ని కొనుగోలు చేయడం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా చర్చ మొదలైంది. ఈ యుద్ధ విమానాన్ని ఇంగ్లాండ్ ఎంత ఖర్చు పెట్టి కొనుగోలు చేసింది అనే విషయం మాత్రం బయటికి తెలియ రాలేదు.