https://oktelugu.com/

ట్రూ కాలర్ యాప్ వాడుతున్నారా.. కొత్త ఫీచర్లు ఇవే..?

ప్రస్తుతం దేశంలో ఎక్కువమంది ఉపయోగిస్తున్న యాప్ లలో ట్రూ కాలర్ యాప్ ఒకటనే సంగతి తెలిసిందే. ట్రూ కాలర్ ఎప్పటికప్పుడు యూజర్లకు ప్రయోజనం చేకూరే విధంగా కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తోంది. తాజాగా ట్రూ కాలర్ ఇన్ బాక్స్ క్లీనర్, స్మార్ట్ ఎస్.ఎం.ఎస్ ఫిల్టర్, గ్రూప్ వాయిస్ కాలింగ్ ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. యూజర్ల అవసరాలకు అనుగుణంగా కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చినట్టు ట్రూ కాలర్ తెలిపింది. ట్రూ కాలర్ తెచ్చిన గ్రూప్ వాయిస్ కాలింగ్ ఫీచర్ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : June 19, 2021 / 04:37 PM IST
    Follow us on

    ప్రస్తుతం దేశంలో ఎక్కువమంది ఉపయోగిస్తున్న యాప్ లలో ట్రూ కాలర్ యాప్ ఒకటనే సంగతి తెలిసిందే. ట్రూ కాలర్ ఎప్పటికప్పుడు యూజర్లకు ప్రయోజనం చేకూరే విధంగా కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తోంది. తాజాగా ట్రూ కాలర్ ఇన్ బాక్స్ క్లీనర్, స్మార్ట్ ఎస్.ఎం.ఎస్ ఫిల్టర్, గ్రూప్ వాయిస్ కాలింగ్ ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. యూజర్ల అవసరాలకు అనుగుణంగా కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చినట్టు ట్రూ కాలర్ తెలిపింది.

    ట్రూ కాలర్ తెచ్చిన గ్రూప్ వాయిస్ కాలింగ్ ఫీచర్ ద్వారా ఒకేసారి 8 మంది మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. హై వాయిస్ క్లారిటీ కాలింగ్ అనుభూతిని ట్రూ కాలర్ ఇస్తుంది. ఈ ఫీచర్ ద్వారా కాంటాక్ట్ లిస్ట్ లో లేని వ్యక్తులతో కూడా మాట్లాడటంతో పాటు స్పామ్ యూజర్లను గుర్తించి సులభంగా తొలగించవచ్చు. స్క్రీన్ పైన కాల్స్ లో మాట్లాడేవాళ్ల లొకేషన్స్ ను కూడా చూసే అవకాశం అయితే ఉంటుంది.

    స్మార్ట్ ఎస్.ఎం.ఎస్ ఫిల్టర్ సహాయంతో యూజర్లు స్పామ్ మెసేజ్ లను సులభంగా గుర్తించవచ్చు. ట్రూ కాలర్ చెబుతున్న లెక్కల ప్రకారం యూజర్లకు రోజుల్లో 80 శాతం వాణిజ్యపరమైన మెసేజ్ లు వస్తున్నాయి. ఇన్ బాక్స్ క్లీనర్ సహాయంతో ఫోన్ ఇన్ బాక్స్ లో ఉన్న స్పామ్ మెసేజ్ లను సులభంగా క్లీన్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే ఈ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.

    ఐఓఎస్ యూజర్లకు ఈ ఫీచర్లు ఎప్పటినుంచి అందుబాటులోకి వస్తాయనే వివరాలు తెలియాల్సి ఉంది. ఆండ్రాయిడ్ యూజర్లు ట్రూ కాలర్ యాప్ ను అప్ డేట్ చేసుకోవడం ద్వారా ఈ ఫీచర్లను పొందవచ్చు.