ఒక మనిషి తన మలిదశలో ఎవరిపై ఆధారపడకుండా జీవించినప్పుడే అతని జీవితం బ్లాక్ బస్టర్ అవుతుందని అంటూ పూరి సగటు మనిషికి క్లారిటీ ఇచ్చాడు. మరి పూరి మాటల్లోనే ‘ఒక్కటే జీవితం.. ఒక్కసారే మనం బతుకుతాం. ఈ జీవితంలో ఎవరూ నీ కోసం పుట్టలేదు, కేవలం ఈ జీవితం నీది. ఏం చేసినా నీ కోసమే చెయ్. నీకు నచ్చిందే చేసేయ్. నువ్వు కూడా ఎవ్వరి కోసం పుట్టలేదు. అందుకే నీకు నచ్చినట్టుగా ఉండు అంటూ మనిషి ఎలా ఉండాలో చెప్పుకొచ్చిన పూరి,
మన బతుకే మూణ్నాళ్ల ముచ్చట అని, ఆ మూణ్నాళ్ల ముచ్చటకు 16 రోజుల పెళ్లెందుకు? అసలు ఈ బానిస బతుకెందుకు? అని పూరి జీవితం అంటే చెప్పాడు. జీవితంలో పెళ్లి అనే ఒక్క తప్పు చేస్తే ఇక ఆ తరువాత ఎన్ని ఫిలాసఫీలు చదివినా ఎలాంటి ఉపయోగం ఉండదు అని, నిన్ను నువ్వు ప్రేమించుకోవడం నేర్చుకుంటే ఏమైనా చేయగలవు అని తనదైన శైలిలో కొత్త పాఠం వివరించాడు.
పనిలో పనిగా ఎవ్వరికీ మాట ఇవొద్దు అని, నీకంటూ ఒక ప్రపంచం సృష్టించుకో. అలాగే దేనికి భయపడకు. శాంతంగా ఉండడం నేర్చుకో. ఒక పదిమందికి నీ చేతితో తిండిపెట్టు. నీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకో, అసలు సమాజాన్ని సీరియస్‌గా తీసుకోవద్దు. ఇక 60 ఏళ్లు అంటే బుద్ధి, జ్ఞానం వచ్చే వయసు అది. ఆ ఏజ్ లో నీ జూనియర్స్‌లో స్ఫూర్తి నింపు. 70 లేదా 80 ఏళ్లు వచ్చినా సరే, నీ పనులు నువ్వు చేసుకోగలిగితే చాలు. ఎందుకంటే క్లైమాక్స్ బాగుంటేనే సినిమా సూపర్ హిట్ అవుతుంది. మేక్ యువర్ లైఫ్ ఏ బ్లాక్‌బస్టర్. ఇది ఫిలాసఫీ కాదు.. కామన్‌సెన్స్’ అంటూ చెప్పుకుకొచ్చాడు.