Perplexity AI: కృత్రిమ మేధ లో ఓపెన్ ఏఐ సంస్థ రూపొందించిన చాట్ జీపీటీ ఓ సంచలనం. గత రెండు సంవత్సరాలుగా చాట్ జిపిటి సాంకేతిక ప్రపంచంలో పెను మార్పులకు కారణమవుతోంది. ఎప్పుడైతే ఓపెన్ ఏఐ చాట్ జిపిటిని రూపొందించిందో.. ఆ తర్వాత మెటా, google, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు కృత్రిమ మేధ లో రకరకాల ప్రయోగాలు చేస్తున్నాయి. కొత్త కొత్త సాంకేతికతలను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. అయితే కృత్రిమ మేధలో ఇవన్నీ ఎన్ని రకాలుగా సాంకేతికతలను అందుబాటులోకి తీసుకొచ్చినప్పటికీ.. ఇప్పటికి చాట్ జిపిటి మొదటి స్థానంలో ఉంది. చివరికి గ్రూక్ కూడా దీనిని అధిగమించలేకపోతోంది. అయితే కాకలు తీరిన కంపెనీలకు కూడా సాధ్యం కానీ ఘనతను 31 సంవత్సరాల భారతీయ యువకుడి ఆవిష్కరణ అందుకుంది.
31 సంవత్సరాల భారతీయుడు అరవింద్ శ్రీనివాస్ perplexity AI కృత్రిమ మేధ లో సంచలనాలు సృష్టిస్తోంది. ఏకంగా చాట్ జిపిటి ని దాటేసింది.. యాపిల్ యాప్ స్టోర్ లో మొదటి స్థానంలో ఉంది.. perplexity Pro సబ్ స్క్రిప్షన్ కు ఏడాదికి 17వేలపాటు చెల్లించాల్సి ఉంటుంది.. ఎయిర్ టెల్ యూజర్లు మాత్రం ఉచితంగానే దీని సేవలు అందుకోవచ్చు. దీంతో ఇటీవల ఈ యాప్ డౌన్లోడ్స్ పెరిగాయని టెక్నాలజీ నిపుణులు చెబుతున్నారు.. అరవింద్ శ్రీనివాస్ 1994లో చెన్నైలో జన్మించారు. ఐఐటి మద్రాస్ లో చదువుకున్నారు. మిగతా చదువులను కాలిఫోర్నియా యూనివర్సిటీలో పూర్తి చేశారు.
Also Read: గ్రామస్థాయి లో కృత్రిమ మేధ విప్లవం.. కేంద్రం ప్రణాళిక మామూలుగా లేదుగా!
అరవింద్ గతంలో అనేక ఐటీ కంపెనీలలో పని చేశారు. కృత్రిమ మేధ పై పరిశోధనలు చేస్తున్నారు. కొంతమందితో కలిసి ఒక సంస్థను ఏర్పాటు చేశారు. భారతీయ మూలాలు ఉన్న అరవింద్ శ్రీనివాస్ కు కృత్రిమ మేధ మీద విపరీతమైన పట్టు ఉంది. అందువల్లే యూజర్లకు ఎటువంటి సదుపాయాలు కావాలో తెలుసు. అందువల్లే అందులో యూజర్లకు కావలసిన ఆధునిక సదుపాయాలతోపాటు.. వివిధ రకాలైన సాంకేతికతను అందులో జోడించారు. అందువల్లే ఈ యాప్ విపరీతమైన డిమాండ్ ను సొంతం చేసుకుంది.. చాట్ జిపిటిని వెనక్కి నెట్టిందంటే మామూలు విషయం కాదు కదా.
Perplexity యాప్ లో సమగ్ర సమాచారంతోపాటు.. నేటి కాలానికి అనుగుణంగా ఫ్యాక్ట్ చెక్ అనే వ్యవస్థ కూడా అందుబాటులో ఉంది. ఇందులో కేవలం వాస్తవ సమాచారం మాత్రమే అందుబాటులో ఉంటుంది. వైద్యం నుంచి మొదలు పెడితే టెక్నాలజీ వరకు ప్రతిదీ సమగ్రంగా పరిశీలించిన తర్వాతే యూజర్ కు చేరవేరుస్తూ ఉంటుంది. ఇందులో అశ్లీల కంటెంట్ అనేది ఉండదు. అందువల్ల చిన్న పిల్లలు కూడా దీనిని సులువుగా వాడవచ్చు. పైగా ఈ అప్లికేషన్ ఓపెన్ చేసే క్రమంలోని వయసును, ఇతర విషయాలను అడుగుతుంది. దీనికి తగ్గట్టుగానే సమాచారం ఇస్తుంది.. అందువల్లే ఇది చాట్ జిపిటిని దాటేసింది. ఇలాగే కొనసాగితే కృత్రిమ మేధలో ఈ అప్లికేషన్ మరిన్ని సంచలనాలు సృష్టించే అవకాశం ఉందని టెక్నాలజీ నిపుణులు భావిస్తున్నారు.