Zeus spacecraft: ఐరోపా అంతరిక్ష సంస్థ జ్యూస్ యాత్ర.. ఇంధనం లేకుండానే గురుడి గుట్టు తేల్చేందుకు సరికొత్త ప్రయోగం..

ఐరోపా అంతరిక్ష సంస్థ ప్రయోగించే జ్యూస్ వ్యోమనౌకను తక్కువ ఇంధనంతో సౌర కుటుంబంలోకి పంపించనున్నారు. ఏకంగా సౌర కుటుంబంలోని అతిపెద్ద గ్రహమైన గురుడి మీదికి దీనిని పంపిస్తున్న నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తికర చర్చ జరుగుతోంది. గురుడు సౌర కుటుంబంలోని అతిపెద్ద గ్రహం

Written By: Anabothula Bhaskar, Updated On : July 29, 2024 10:50 am
Follow us on

Zeus spacecraft:   : సౌర కుటుంబంలో అతిపెద్ద గ్రహం ఏదంటే వెంటనే మనకు గుర్తుకొచ్చేది గురుడు. పరిమాణంలో అతిపెద్దదైన ఈ గ్రహం గురించి ఇప్పటివరకు ఖగోళ శాస్త్రవేత్తలకు తెలిసింది చాలా తక్కువ.. అక్కడ పూర్తి హిమ వాతావరణం ఉంటుందని, గ్రహాంతరవాసులు నివాసం ఉంటున్నారని మాత్రమే శాస్త్రవేత్తలకు తెలుసు. నిజంగా గురు గ్రహం మనుషుల నివాసానికి యోగ్యమేనా? అక్కడ మంచు కొండలు ఉన్నాయా? ఆక్సిజన్ ఏ స్థాయిలో ఉంటుంది? ఖనిజాలు ఏమైనా లభిస్తాయా? భవిష్యత్తు కాలంలో ఆ ప్రాంతం మనుషులు మనుగడ సాగించేందుకు యోగ్యంగా మారుతుందా? అనే ప్రశ్నలకు సమాధానాలు వెతికేందుకు ఐరోపా అంతరిక్ష సంస్థ జ్యూస్ స్పేస్ క్రాఫ్ట్ తో సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుడుతోంది. వాస్తవానికి సౌర కుటుంబంలో కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇతర గ్రహాల వద్దకు వ్యోమ నౌకలను పంపించడం సాధ్యం కాదు. ఎందుకంటే స్టార్టింగ్ పాయింట్ నుంచి డెస్టినేషన్ పాయింట్ వరకు ఒక సరళరేఖలో వ్యోమ నౌకలను పంపించడం అంత సులువు కాదు. అక్కడికి ప్రయాణం సాగించాలంటే చాలా కష్టాలు ఎదుర్కోవాలి. వినూత్నమైన పద్ధతులు అనుసరించాలి. స్థూలంగా చెప్పాలంటే నార్మల్ ప్యాసింజర్.. లాంగ్ ట్రావెలర్ సిద్ధాంతాన్ని అమలు చేయాలి. అయితే ఐరోపా అంతరిక్ష సంస్థ ప్రయోగిస్తున్న జ్యూస్ వ్యోమ నౌక కూడా పై పద్ధతిలోనే సౌర కుటుంబానికి ప్రయాణించనుంది. చరిత్రలో తొలిసారిగా భూమి – చందమామ గురుత్వాకర్షణ శక్తిని ఇంధనంగా అనువుగా మార్చుకోబోతోంది. గత ఏడాది భూమి నుంచి బయలుదేరిన ఈ స్పేస్ క్రాఫ్ట్.. గురుత్వాకర్షణ శక్తిని ఇంధనం గా మార్చుకునేందుకు త్వరలోనే భూమి వద్దకు తిరిగి రానుంది.

జ్యూస్ వ్యోమ నౌక ఎలా పనిచేస్తుంది?

ఐరోపా అంతరిక్ష సంస్థ ప్రయోగించే జ్యూస్ వ్యోమనౌకను తక్కువ ఇంధనంతో సౌర కుటుంబంలోకి పంపించనున్నారు. ఏకంగా సౌర కుటుంబంలోని అతిపెద్ద గ్రహమైన గురుడి మీదికి దీనిని పంపిస్తున్న నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తికర చర్చ జరుగుతోంది. గురుడు సౌర కుటుంబంలోని అతిపెద్ద గ్రహం. దీని చుట్టూ తిరుగుతున్న 95 ఉపగ్రహాలలో గ్యానిమేడ్, క్యాలిస్టో వంటివి శాస్త్రవేత్తలకు సంభ్రమాశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ఎందుకంటే ఈ ఉపగ్రహాలలో పూర్తి హిమమయమైన ఉపరితలాలు ఉన్నాయి. వాటి కింద మహా సాగరాలు నిక్షిప్తమై ఉన్నాయని శాస్త్రవేత్తల నమ్మకం. పైగా అక్కడ గ్రహాంతర జీవులు మనగడ సాగించేందుకు అనువైన పరిస్థితులు కూడా ఉన్నాయని శాస్త్రవేత్తలు బలంగా నమ్ముతున్నారు. అయితే వీటి వెనుక ఉన్న గుట్టును తేల్చేందుకు ఐరోపా అంతరిక్ష సంస్థ గత ఏడాది ఏప్రిల్ 14న జ్యూస్ స్పేస్ క్రాఫ్ట్ ను ప్రయోగించింది. దీని బరువు 6 టన్నులు. 2031 జూలై నెలలో అది గురు గ్రహానికి దగ్గరగా వెళుతుంది. ప్రస్తుతం ఈ స్పేస్ క్రాఫ్ట్ భూమికి కోటి కిలోమీటర్ల దూరంలో ఉంది..

80 కోట్ల కిలోమీటర్ల దూరంలో..

ఖగోళ శాస్త్రవేత్తల అంచనా ప్రకారం గురు గ్రహం భూమికి 80 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంది. అయితే గురు గ్రహాన్ని జ్యూస్ స్పేస్ క్రాఫ్ట్ నేరుగా చేరాలంటే భూమి గురుత్వాకర్షణ శక్తి నుంచి తప్పించుకోవాలి. సౌర కుటుంబం మీదుగా తన ప్రయాణాన్ని సాగించాలి. అందుకోసం శక్తివంతమైన రాకెట్ సహాయం అవసరం. జ్యూస్ స్పేస్ క్రాఫ్ట్ ను ప్రయోగించిన ఏరియాన్ రాకెట్ కు ఆ స్థాయిలో సామర్థ్యం లేదు. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం స్పేస్ క్రాఫ్ట్ నేరుగా గురుడి వద్దకు వెళ్లిన తర్వాత దాని వేగాన్ని రాపిడ్ గా కంట్రోల్ చేస్తేనే అది ఆ గ్రహం కక్ష్యలోకి ప్రవేశిస్తుంది. అందువల్ల నిర్దేశిత సమయంలో దాన్ని స్పీడ్ కంట్రోల్ చేసేందుకు భారీగా ఇంధనం అవసరం ఉంటుంది. ఖగోళ శాస్త్రవేత్తల అంచనా ప్రకారం గురుడి వద్దకు నేరుగా ఉండే మార్గంలో పంపేందుకు జ్యూస్ స్పేస్ క్రాఫ్ట్ కు దాదాపు 60 టన్నుల ఇంధనం అవసరం. ప్రస్తుతం జ్యూస్ కేవలం 3 టన్నుల ఇంధనం మాత్రమే మోయగలుగుతుంది. అందువల్లే శాస్త్రవేత్తలు భూ గురుత్వాకర్షణ శక్తి అనే ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకున్నారు. ఈ విధానం వల్ల జ్యూస్ స్పేస్ క్రాఫ్ట్ సౌర కుటుంబంలోని అన్ని గ్రహాల గురుత్వాకర్షణ శక్తిని ఇంధనం గా మార్చుకుంటుంది. తన గమనాన్ని నిర్దేశించుకుంటుంది. వేగాన్ని నియంత్రించుకుంటుంది. అయితే ఈ విన్యాసం చేసేందుకు జ్యూస్ వచ్చే నెలలో తిరిగి చందమామ, భూమి పైకి వస్తోంది. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం ఆగస్టు 19 జ్యూస్ చంద్రుడికి 750 కిలోమీటర్ల దూరంలో వచ్చి వెళ్తుంది. చందమామ గురుత్వాకర్షణ శక్తి వల్ల స్పేస్ క్రాఫ్ట్ స్పీడ్, దిశలో స్వల్ప మార్పు చోటు చేసుకుంటుంది. ఆ తర్వాత ఆగస్టు 20న భూమికి 6,807 కిలోమీటర్ల దూరంలోకి జ్యూస్ చేరుకుంటుంది. భూమి గురుత్వాకర్షణ శక్తి వల్ల వేగం తగ్గడంతో పాటు జ్యూస్ స్పేస్ క్రాఫ్ట్ దిశ పూర్తిగా మారిపోతుంది. ఇదే సమయంలో జ్యూస్ గురు గ్రహానికి షార్ట్ కట్ రూట్ లో వెళ్లేందుకు బలమైన అడుగుపడుతుంది. దీనివల్ల చాలా వరకు ఇంధనం సేవ్ అవుతుంది.