Asteroid: భూమికి పొంచి ఉన్న ప్రమాదం.. దూసుకొస్తున్న భారీ గ్రహ శకలం.. నాసా ఏమని హెచ్చరించిందంటే..

మన పైన ఉన్న నీలాకాశం ఎన్నో అద్భుతాలకు నెలవు..ఆ ఆకాశంలోనే భూమి.. ఇతర గ్రహాలు ఉంటాయి. కేవలం భూమి మాత్రమే జీవరాశి మనుగడ సాగించడానికి అనువుగా ఉంటుంది.. భూమి సూర్యుడు చుట్టూ నిత్యం తిరుగుతూనే ఉంటుంది. అందువల్లే పగలు, రాత్రి ఏర్పడుతుంటాయి.

Written By: Anabothula Bhaskar, Updated On : October 23, 2024 8:58 am

Asteroid(1)

Follow us on

Asteroid: భూమి కంటే పెద్ద గ్రహాలు అంతరిక్షంలో చాలానే ఉన్నప్పటికీ.. ఎక్కువ గ్రహశకలాలు దూసుకు వచ్చే గ్రహాలలో భూమి ముందు వరసలో ఉంటుంది. ప్రస్తుతం ఒక గ్రహశకలంతో భూమికి ప్రమాదం పొంచి ఉంది. విశ్వంలో గమ్యం అంటూ లేకుండా పరిభ్రమించే గ్రహశకలాలు భూమివైపు ఎక్కువగా వస్తుంటాయి. ఇందులో కొన్ని భూమికి దగ్గరగా వచ్చి వెళ్తాయి. కొన్ని మాత్రం వాతావరణంలోకి ఎంట్రీ ఇస్తాయి. భూ వాతావరణంలోకి అవి రాగానే ఒకసారిగా మండిపోతుంటాయి. అయితే భారీ గ్రహశకలాలు భూమిని ఢీకొడితే మాత్రం పెను విపత్తులు చోటుచేసుకుంటాయి. వందల సంవత్సరాల క్రితం ఒక భారీ గ్రహశకలం భూమిని ఢీకొట్టడం వల్లే డైనోసార్స్ అంతరించిపోయాయని శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. ప్రస్తుతం అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఒక కీలక ప్రకటన చేసింది. భూమిపైకి దూసుకు వచ్చే గ్రహశకలానికి సంబంధించి కీలకమైన అప్డేట్ ఇచ్చింది. ఈనెల 24న మధ్యాహ్నం ఒంటిగంట 50 నిమిషాల సమయంలో భూమికి దగ్గరగా ఒక గ్రహశకలం వెళ్తుందని నాసా వెల్లడించింది. దానికి “2024 టిపి 17” అని పేరు పెట్టింది. ఆ గ్రహశకలం విమానమంత పరిమాణంలో ఉంటుందట.

భూమికి 46 లక్షల కిలోమీటర్ల దూరం నుంచి..

2024 టిపి 17 భూమికి 46 లక్షల కిలోమీటర్ల దూరం నుంచి ప్రయాణిస్తుందట. స్థూలంగా చెప్పాలంటే భూమికి దగ్గరగానే వెళుతుందట. అది గంటకు 20,832 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందట. దీని గమనాన్ని తాము నిశితంగా పరిశీలిస్తున్నామని నాసా చెబుతున్నది. దానివేగం సాధారణంగానే ఉన్నప్పటికీ.. భూమికి అత్యంత సమీపంలో వెళ్తున్న నేపథ్యంలో భయాలు వ్యక్తమవుతున్నాయి. ఆ గ్రహశకలం 46,40,400 కిలోమీటర్ల దూరం నుంచి వెళ్తున్నది. అయితే అది భూమికి, చంద్రుడికి మధ్య దూరం 3.84 లక్షల కిలోమీటర్ల కంటే.. 12 రెట్లు ఎక్కువ అని నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నాసాకు చెందిన సెంటర్ ఫర్ నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్ స్టడీస్ ఆ గ్రహశకలంపై నిఘా వేసి ఉంచింది. దానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించడానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనేక అబ్జర్వేటరీల తోడ్పాటును తీసుకున్నది..” ఇలాంటి గ్రహశకలాల వల్ల ప్రమాదం లేదని చెప్పడానికి లేదు. కాకపోతే ఇటువంటి వాటిపై నిరంతర నిఘా అవసరం. ఒకవేళ పెను విపత్తులు చోటు చేసుకుంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలని దానిపై ఒక అవగాహన ఏర్పడుతుంది. గతంలో ఇలాంటి గ్రహశకలం భూమిని ఢీకొన్నప్పుడే డైనోసార్లు అంతర్దానమయ్యాయి. అలాంటి పరిణామం మరొకటి ఇప్పటివరకు చోటుచేసుకుకపోయినప్పటికీ.. అలాంటివి జరగబోవని చెప్పడానికి లేదని” నాసా శాస్త్రవేత్తలు అంటున్నారు.