WhatsApp: మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరూ Whatsapp తప్పనిసరిగా వాడాల్సిందే. ఎందుకంటే కమ్యూనికేషన్ తో పాటు కొన్ని ఫైల్స్, మనీ సెండ్ చేయడానికి వాట్సాప్ తప్పనిసరిగా మారిపోయింది. కేవలం సాధారణ అవసరాలకు మాత్రమే కాకుండా ఉద్యోగ, వ్యాపార అవసరాలకు కూడా వాట్సాప్ కేంద్ర బిందువుగా మారిపోయింది. అయితే ఇలా ప్రతి ఫోన్లో వాట్సాప్ ముఖ్యంగా మారడంతో చాలామంది సైబర్ నేరగాళ్లు వీటిని హ్యాక్ చేస్తున్నారు. దీంతో విలువైన సమాచారాన్ని దొంగిలిస్తున్నారు. అయితే వినియోగదారుల శ్రేయస్సు కోసం వాట్సాప్ మాత సంస్థ ఎప్పటికప్పుడు యాప్ ను అప్డేట్ చేస్తోంది. అయితే తాజాగా టెలికాం శాఖ టెలిగ్రామ్, షేర్ చాట్ వంటి యాప్ లతోపాటు వాట్సాప్ కు కొన్ని రకాల సూచనలు చేసింది. ఈ సూచనల ప్రకారం వాట్స్ యాప్ ను అప్డేట్ చేయాలని పేర్కొంది. అవేంటంటే?
ఇప్పటివరకు వాట్స్ యాప్ ను కేవలం మొబైల్ లోనే కాకుండా డెస్క్ టాప్ కంప్యూటర్ లేదా లాప్టాప్ కు కనెక్ట్ చేసి వాడుకునేవారు. ఇలాంటి సమయంలో ఒకసారి సిస్టంలో వాట్సాప్ కనెక్ట్ అయిన తర్వాత కొన్ని రోజులకు గానీ లాగౌట్ అయ్యే అవకాశం లేదు. ప్రత్యేకంగా లాగౌట్ చేసి మళ్లీ లాగిన్ అయ్యేవారు. అయితే ఇలా రోజుల తరబడి డెస్క్టాప్ లో లాగిన్ అయి ఉండడం వల్ల సైబర్ నేరాలు జరిగే అవకాశం ఉందని వాట్సాప్ మాతృ సంస్థ గుర్తించింది. దీంతో యాప్ లో కొన్ని మార్పులు చేసింది. ఈ మార్పులకు అనుగుణంగా వాట్స్ యాప్ ను మార్చాలని టెలికాం శాఖ తెలిపింది.
ఇందుకోసం వినియోగదారులు మొబైల్లో వాట్సాప్ కనెక్ట్ అయ్యే సిమ్ ఉంచుకోవాలని తెలిపింది. అంటే ఏ సిమ్ ద్వారా అయితే కనెక్టు అవుతున్నారో.. ఆ సిమ్ మొబైల్ లో కచ్చితంగా ఉండాలని పేర్కొంది. ఆ సిమ్ ఉంటేనే వాట్సాప్ పనిచేస్తుందని తెలిపింది. అంతేకాకుండా డెస్క్ టాప్ లేదా లాప్టాప్ లో వాట్సాప్ వెబ్ ద్వారా కనెక్ట్ అయ్యేవారు ఆరు గంటల పాటు మాత్రమే లాగిన్ లో ఉంటారు. ఆ తర్వాత ఆటోమేటిగ్గా లాగౌట్ అవుతుంది. మళ్లీ అవసరం అనుకుంటే లాగిన్ కావాల్సిందే. ఇలా ఎప్పటికప్పుడు లాగిన్ కావడం వల్ల సెక్యూరిటీ సమస్యలు రాకుండా ఉంటాయని పేర్కొంది. ఈ విధంగా వాట్సాప్ సిమ్ తో కనెక్టు అయ్యేవిధంగా 90 రోజుల్లో చర్యలు తీసుకోవాలని టెలికాం శాఖ వాట్సాప్ యాజమాన్యానికి తెలిపింది.
ఇప్పటినుంచి వినియోగదారులు వాట్సాప్ లో ఉపయోగించాలంటే మొబైల్లో ఏ సిమ్ తో అయితే కరెక్టు అవుతున్నారో.. ఆ సిమ్ తప్పనిసరిగా ఉండాలని తెలిపింది. అయితే ఈ చర్యలు ఎప్పటినుంచి.. అనేది త్వరలో ఆదేశాలు జారీ అయ్యే అవకాశాలున్నాయి.