Elon Musk: టెస్లా నుంచి మొదలుపెడితే స్టార్ లింక్ వరకు మస్క్ చేయని వ్యాపారం అంటూ లేదు. ఫలితంగా ప్రపంచంలోనే శ్రీమంతుడిగా మస్క్ పేరు తెచ్చుకున్నాడు. ఇంతటితోనే మస్క్ ఆగడం లేదు. అంతకుమించి అనే స్థాయిలో వ్యాపారాలను చేయబోతున్నాడు.
ఇప్పటికే మస్క్ శాటిలైట్ ఇంటర్నెట్ వ్యాపారం లోకి ప్రవేశించాడు. అమెరికా నుంచి మొదలు పెడితే చాలా దేశాలలో శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ సేవలు అందిస్తున్నాడు. అంతేకాదు స్టార్ లింక్ ద్వారా అంతరిక్ష పర్యాటకానికి కూడా అతడు శ్రీకారం చుట్టాడు.. అంతేకాదు, భవిష్యత్తు కాలంలో ఇంకా సరికొత్త వ్యాపారాలు చేయాలని అతడు లక్ష్యంగా పెట్టుకున్నాడు. సంప్రదాయ విధానాలను పక్కనపెట్టి.. భవిష్యత్తు కాలాన్ని ముందే ఊహించి.. మనిషి అవసరాల ఆధారంగా వ్యాపారం చేస్తున్నాడు మస్క్.
మస్క్ సంపద ఇప్పటికే లక్షల కోట్లకు చేరుకుంది. ఇంకా ఇంకా ఆ సంపద పెరుగుతూనే ఉంది. సంప్రదాయమైన వ్యవహారాలను అతడు పక్కనపెట్టి.. కొత్త కొత్త విధానాలలో వ్యాపారాలు చేస్తూ ఉంటాడు. అందువల్లే మస్క్ ఎవరికీ అందని స్థాయిలోకి వెళ్ళిపోతున్నాడు. అయితే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సరికొత్త వ్యాపారానికి శ్రీకారం చుట్టాడు మస్క్. స్పేస్ ఎక్స్ ద్వారా సరికొత్త చరిత్రకు నాంది పలకడానికి అతడు కంకణం కట్టుకున్నాడు. అంతరిక్షంలో ఏకంగా 10 లక్షల ఉపగ్రహాలతో ప్రపంచంలోనే అతిపెద్ద ఏఐ డేటా సెంటర్ ను నిర్మించడానికి మస్క్ సంకల్పం పెట్టుకున్నాడు.
నిరంతర సౌరశక్తి.. లేజర్ టెక్నాలజీ ద్వారా ఈ వ్యవస్థ పని చేస్తూ ఉంటుంది. తద్వారా ఏఐ కంప్యూటింగ్ సామర్థ్యం పెరుగుతుంది. ఈ సెంటర్ గనుక అందుబాటులోకి వస్తే భూమిపై పెద్దగా ఖర్చు లేకుండానే డేటా ప్రాసెసింగ్ చేయవచ్చు. కష్టమైన పనులను కూడా మరింత ఎక్కువ వేగంతో చేయవచ్చు.. అంతేకాదు.. సమర్థవంతమైన సేవలు అందించవచ్చని నిపుణులు చెబుతున్నారు.