Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఒక వ్యూహం ప్రకారం అడుగులు వేస్తున్నారు. అది స్పష్టంగా తెలుస్తుంది కూడా. ఒకవైపు తన శాఖల ద్వారా గ్రామీణ, గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నారు. అదే సమయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల విధ్వంసాలను బయటకు తెస్తున్నారు. ఏకకాలంలో అభివృద్ధి, వైసిపి వైఫల్యాలు ప్రజలకు అర్థమయ్యేలా చేస్తున్నారు. మొన్న మధ్యన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూముల ఆక్రమణ వ్యవహారం పవన్ బయట పెట్టిన తర్వాత ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. తాజాగా పల్లె పండుగ 2.0 ప్రారంభం కావడంతో పల్లెల్లో సందడి నెలకొంది. ఏకకాలంలో పవన్ వ్యూహం తెలియక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సతమతం అవుతోంది. పవన్ విషయంలో ఎలా ముందుకెళ్లాలో తెలియక మల్లగుల్లాలు పడుతోంది. పవన్ వ్యూహాత్మక శైలి విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరుస్తుంది.
* ముగ్గురు నేతలు చెరో బాధ్యతలు..
కూటమి సమన్వయంతో ముందుకు సాగుతోంది. సీఎం చంద్రబాబు పాలనపై పూర్తిగా దృష్టిపెట్టారు. లోకేష్ విదేశీ పెట్టుబడులపై ఫోకస్ చేశారు. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు తెస్తున్నారు. వాటి జోలికి పవన్ కళ్యాణ్ పోవడం లేదు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధికి సంబంధించి పవన్ కళ్యాణ్ పూర్తి స్వేచ్ఛ తో పనిచేస్తున్నారు. అటవీ శాఖతో పాటు గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై పవన్ తనదైన శైలిలో ముందుకు వెళుతున్నారు. అంటే కచ్చితంగా దీని వెనుక వ్యూహం ఉంటుంది. వ్యూహం ప్రకారమే ఆ ముగ్గురు నేతలు ముందుకెళ్తున్నారు. రాజకీయంగా అవసరమైన ప్రతిసారి పవన్ వచ్చి బయట మాట్లాడుతున్నారు. అందులో భాగంగా పెద్దిరెడ్డి లాంటి పెద్ద నేత విషయంలో పవన్ చెప్పేసరికి ప్రజల్లోకి వెళ్ళింది. అదే చంద్రబాబు చెబితే దశాబ్దాల వైరం వారి మధ్య ఉండడంతో కావాలనే చెప్పారని ప్రత్యర్థులు ఆరోపించేవారు.
* ఆ మాట వెనుక మర్మం ఏంటి?
మరో 15 ఏళ్ల పాటు ఏపీలో కూటమి ప్రభుత్వం ఉంటుందని పవన్ కళ్యాణ్ పదేపదే చెబుతున్నారు. ఆ మాట వెనుక ఉన్న మర్మం ఏమిటో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి తెలియడం లేదు. 15 ఏళ్ల పాటు చంద్రబాబు సీఎం గా కొనసాగుతారా? లేకుంటే పవన్ పదవి చేపడతారా? అనేది తెలియక్క వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కన్ఫ్యూజన్లో ఉంది. మరో విడత చంద్రబాబు పదవి చేపట్టేందుకు డోకా లేదు. ఆ తరువాత ఆయన ఆరోగ్యంతో పాటు వయసు సహకరిస్తుందా లేదా అన్నది ఒక అనుమానం. మరోవైపు పవన్ విషయంలో టిడిపి అనుకూల మీడియా వైఖరి సైతం మారడం లేదు. అలాగని పతాక స్థాయిలో ప్రచారం కల్పించడం లేదు. అసలు కూటమిలో ఏం జరుగుతుందని అనుమానం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి వెంటాడుతూనే ఉంది. ఆపై గుట్టు ఆ ముగ్గురు నేతల మధ్య ఉంది. అస్మదీయులకు ప్రయోగిస్తామంటే కుదరని పని కూడా. కూటమి వ్యూహం తెలియక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పడుతున్న బాధ అంతా ఇంతా కాదు కూడా. అయితే ప్రధానంగా డిప్యూటీ సీఎం పవన్ వ్యూహం తెలియక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకు నిద్ర కూడా కరువవుతోంది.